షార్ట్ అండ్ స్వీట్- ప్రభంజనం సృష్టించిన పడుచు పిల్ల
Grammys 2025: గ్రామీస్ 2025 అవార్డుల ప్రదానోత్సవంలో సంచలనం చోటు చేసుకుంది. 25 సంవత్సరాల అమెరికాకు చెందిన పాప్ సింగర్, లిరిసిస్ట్ సబ్రినా కార్పెంటర్ ప్రభంజనం సృష్టించింది. తొలి గ్రామీ అవార్డును గెలుచుకుంది. తన దేశానికే చెందిన టాప్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌ను మట్టికరిపించింది.
బెస్ట్ పాప్ వోకల్ విభాగంలో జయకేతనాన్ని ఎగురవేసింది సబ్రినా కార్పెంటర్. ఆమె రూపొందించిన షార్ట్ అండ్ స్వీట్ ఆల్బమ్‌కు బెస్ట్ పాప్ వోకల్ విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది. ఇది- సబ్రినా కార్పెంటర్‌కు దక్కిన తొలి గ్రామీ అవార్డు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

బెస్ట్ పాప్ వోకల్ కేటగిరీలో బెల్లీ ఎలీష్, అరియానా గ్రాండె, టేలర్ స్విఫ్ట్ పోటీ పడ్డారు. వారందరినీ కాదని సబ్రినాకు ఈ ప్రిస్టేజియస్ అవార్డ్ లభించింది. గతంలో టేలర్ స్విఫ్ట్‌తో కలిసి స్టేజ్ పెర్‌ఫార్మ్ చేసింది సబ్రినా. ఆస్ట్రేలియాతో పాటు లాటిన్ అమెరికా, ఆసియా దేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చింది. ఆ అనుభవం ఇప్పుడామెకు అక్కరకొచ్చింది.
అమెరికా లాస్ ఏంజిలిస్‌లోని క్రిప్టో డాట్ కామ్ ఎరినాలో ఆ దేశ కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటలకు గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. తొలుత- టేలర్ స్విఫ్ట్, విల్ స్మిత్, ఒలీవియా రోడ్రిగో, కార్డీ బీ, క్వీన్ లతీఫా, ఎస్‌జెడ్ఏ.. పెర్‌ఫార్మ్స్ అదరగొట్టాయి.
అనంతరం ఎప్రెస్సో, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.. హిట్ ట్రాక్స్‌ను పెర్‌ఫార్మ్ చేసింది సబ్రినా. ఈ రెండూ కూడా ఆమె రూపొందించిన ఆల్బమ్సే. సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన సూపర్ హిట్ ట్రాక్స్ అవి. ఇప్పుడు ఈ జాబితాలో షార్ట్ అండ్ స్వీట్ కూడా చేరినట్టయింది.












Click it and Unblock the Notifications