సుజీత్‌తో చేతులు కలిపిన సచిన్

తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన ప్రముఖ పెయింట్స్ సంస్థ టెక్నోపెయింట్స్ దేశవ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు భారీ ప్రణాళికను రచించింది. ప్యాన్-ఇండియా సేల్స్, ఆపరేషన్స్‌తో పాటు, రిటైల్ రంగంలో కొత్త భాగస్వాములతో కలిసి దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఫ్రాంచైజీలను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ విస్తరణ ప్రణాళికలో అత్యంత కీలకంగా, టెక్నోపెయింట్స్ తమ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా 'గాడ్ ఆఫ్ క్రికెట్' సచిన్ టెండూల్కర్‌ను నియమించుకుంది.

Sachin Tendulkar is New Brand Ambassador Pan-India Expansion Strategy and OG Sujeeth s Ad Films
సచిన్ టెండూల్కర్, టెక్నోపెయింట్స్ కోసం నటించిన రెండు ప్రచార చిత్రాలను (యాడ్ ఫిల్మ్స్) గురువారం నాడు ముంబైలో చిత్రీకరించారు. ఈ యాడ్ ఫిల్మ్స్‌కు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు మరెవరో కాదు, ఇటీవల 'ఓజీ' (OG) చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న సుజీత్.

టెక్నోపెయింట్స్ వంటి స్థానిక బ్రాండ్ ప్యాన్ ఇండియా స్థాయిలో విస్తరిస్తున్న సమయంలో, దేశం గర్వించదగిన ఐకాన్ అయిన సచిన్‌ను ఎంచుకోవడం వ్యూహాత్మక నిర్ణయం. సచిన్ ఇమేజ్ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకి, కస్టమర్‌లకు బ్రాండ్‌ను మరింత చేరువ చేస్తుందని కంపెనీ భావిస్తోంది.

టెక్నోపెయింట్స్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ ప్రచార చిత్రాలు అతి త్వరలోనే దేశంలోని అన్ని ప్రముఖ మాధ్యమాల ద్వారా విడుదల చేయబడతాయని తెలియజేశారు. పెయింటింగ్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ రంగంలో 'టెక్నోపెయింట్స్' సచిన్ టెండూల్కర్ సహకారంతో జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+