హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి - క్లారిటీ వచ్చేసింది..!!
మెగా ఇంట్లో మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ఇప్పటికే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని మెగా హీరో వరుణ్ తేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిన విషయమే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది.
లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..ఘనంగా వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల వివాహం జరిగింది. తాజాగా మరో మెగా హీరో కూడా వరుణ్ తేజ్ బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. త్వరలోనే మెగా అల్లుడైన సాయి ధరమ్ తేజ్ పెళ్లి జరగనుందని తెలుస్తోంది. అయితే సాయి ధరమ్ తేజ్ ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. 'జవాన్'మూవీలో వీరిద్దరు కలిసి నటించారు. షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారడంతో , వీరు తమ రిలేషన్‌ను పెళ్లిగా మార్చాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ పలువురు హీరోయిన్స్‌లో రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. హీరోయిన్ రెజీనా ,'తిక్క' సినిమా హీరోయిన్‌తోనూ సాయిధరమ్ ఎఫైర్ నడిపినట్టు వార్తలు వచ్చాయి.
ఇక మెహరీన్ విషయానికి వస్తే..''కృష్ణగాడి వీర ప్రేమగాథ'' సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగులో హీరోయిన్‌గా పరిచియమైంది. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇదే సమయంలో భవ్య బిష్టోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ ప్రేమయాణం సాగించింది. భవ్య బిష్టోయ్ తాత మాజీ సీఎం కావడం ఇక్కడ మరో విశేషం.
మెహ్రీన్ తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకుంది. ఈక్రమంలోనే తాను ప్రేమించిన భవ్య బిష్టోయ్‌తో నిశ్చితార్థం వరకు వెళ్లింది. అయితే సడన్‌గా ఏమైందో తెలియదు కానీ..అతనితో వివాహాన్ని రద్దు చేసుకుని అందరికి షాకిచ్చింది. కారణం తెలుపకుండానే భవ్య బిష్టోయ్‌తో పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ప్రకటించింది. ప్రస్తుతం మెగా హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి. మొత్తానికి నెట్టింట్లో వైరల్ అవుతున్న సాయి ధరమ్ తేజ్ పెళ్లి అంశాన్ని మెగా ఫ్యామిలీ ఖండించింది. ఇందులో నిజం లేదని తేల్చేసింది.












Click it and Unblock the Notifications