సీత పాత్రకు సాయిపల్లవి భారీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుసా..?
నటి సాయిపల్లవి ఫిదా సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టింది. తన మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచేసింది. భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్లా అంటూ అందరినీ తనవైపు తిప్పుకుంది. తన అందం, నటనతోనే కాకుండా డ్యాన్స్‌తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సుమారు రెండు సంవత్సరాల తర్వాత ఈ నేచురల్ బ్యూటీ అమరన్ మూవీతో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా అక్టోబర్ 31 న థియేటర్లో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సాయిపల్లవి చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. రామాయణ్ మూవీతో బాలీవుడ్‌లో అడుగపెట్టనుంది ఈ హైబ్రీడ్ పిల్లా. ఇక, ఈ సినిమాలో సీత పాత్రలో కనిపించనుంది ఈ బ్యూటీ. అయితే, ఈ సినిమా కోసం సాయిపల్లవి భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

సాయిపల్లవి రామాయణ్ మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఇక, ఈ చిత్రంలో రాముని పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణభీర్‌కపూర్ కనిపించనున్నారు. నటి సాయిపల్లవి రణబీర్ కపూర్‌కి జోడిగా సీత పాత్రలో నటించనున్నారు. ఇది ఒక పౌరాణిక చిత్రం. సీత పాత్ర కోసం సాయిపల్లవి ఏకంగా పదిహేను కోట్లకుపైనే రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్‌మీడియాలో తెగ హాల్చల్ చేస్తోంది.
ఇక, తాజాగా అమరన్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది ఈ నేచురల్ బ్యూటీ. అమరన్ మూవీలో ఇందు రెబెకా వర్గీస్ అనే పాత్రలో ఆర్మీ ఆఫీసర్ భార్యగా సాయిపల్లవి కనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోగా అమరన్ పాత్రలో శివకార్తికేయన్ నటించారు. ఇందు పాత్రలో నటించనున్న సాయిపల్లవికి ఇది ఒక ఛాలెంజింగ్ రోల్ అని చెప్పుకోవాలి.
ఈ సినిమా కోసం సాయిపల్లవి మూడు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ చిత్రాలతో తెలుగులో కూడా పలు చిత్రాలలో సాయిపల్లవి నటిస్తోంది. తెలుగులో నాగచైతన్యతో కలిసి మరోసారి నటించనుంది. తండేల్ మూవీ నాగచైతన్య సరసన చేస్తోంది సాయిపల్లవి. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో వస్తున్న సినిమా ఇదే.












Click it and Unblock the Notifications