పెళ్లి ఫొటోలతో షాకిచ్చిన సాయి పల్లవి
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోన్న పేర్లలో సాయి పల్లవి కూడా ఒకరు. ఆమె సినిమాలతో కన్నా, సోషల్ మీడియాలోనే ఎక్కువ హంగామా సృష్టిస్తున్నారు. తన మొదటి సినిమా నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి..సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది.
ఇక సాయి పల్లవి డ్యాన్స్‌కు అయితే ప్రత్యేక అభిమాన గణమే ఉందని చెప్పాలి. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇక హద్దులు దాటే గ్లామర్ షోకు సైతం సాయి పల్లవి దూరంగా ఉంటుంది.

ఇదే సాయి పల్లవిని ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టంది. హీరోయిన్స్‌లో సాయి పల్లవికంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల సాయి పల్లవి చెల్లెలు పెళ్లి ఘనంగా జరిగింది. తన సోదరి పూజ పెళ్లిలో డ్యాన్స్ చేసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.అయితే సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోలు తప్పిస్తే, సాయి పల్లవి తన ఫొటోలను బయటపెట్టలేదు. అయితే చెల్లెలు పెళ్లి అయిన మూడు నెలల తర్వాత పెళ్లి ఫొటోలను సాయి పల్లవి షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications