బీచ్‌లో సాయి పల్లవి రచ్చ..స్లీవ్‌లెస్‌తో మత్తెక్కించిందిగా..!
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా 'ఫిదా' నుంచి మొన్న వచ్చిన 'విరాటపర్వం' వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. 'గార్గి' సినిమాలో సాయి పల్లవి నటనగానూ ఈ అవార్డు ఆమెకు దక్కింది. 'అమరన్'సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉంటే సాయి పల్లవి తాజాగా తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది.ఈ ఫొటోలను చూస్తే సాయి పల్లవి ఓ ట్రిప్‌కు వెళ్లినట్టు స్పష్టం అవుతోంది. తన చెల్లి, ఫ్రెండ్‌తో కలిసి ఆస్ట్రేలియా వెకేషన్‌కు వెళ్లింది. ఈ ఫొటోలను షేర్ చేస్తూ ''స్పెషల్ ట్రిప్. మనోహరమైన వ్యక్తులు, అడ్వెంచర్, లాఫ్టర్'' అనే క్యాప్షన్ జత చేసింది. అయితే గ్లామర్‌కు దూరంగా ఉంటే సాయి పల్లవి స్లీవ్‌లెస్‌తో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఎప్పుడు పద్దతిగా కనిపించే సాయి పల్లవి, ఇలా స్లీవ్‌లెస్‌తో కనిపించే సరికి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి గ్లామర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications