"రామాయణ" కోసం సాయి పల్లవికి కళ్లు చెదిరే రెమ్యూనరేషన్ !
సాయి పల్లవి... చిత్ర పరిశ్రమలో ఈ భామకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ప్రేక్షకులు ఈమెను ముద్దుగా లేడి పవర్ స్టార్ అని పిలుచుకుంటున్నారు.
మలయాళం మూవీ " ప్రేమమ్ " తో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ చిత్రంతో సాలీడ్ హిట్ అందుకుంది.
ఇక తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఫిదా సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత.. ఎంసీఏ, పడి పడి లేచె మనసు, విరాటపర్వం, లవ్‌స్టోరీ, శ్యామ్ సింగరాయ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. రీసెంట్ గానే తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అలానే నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూ.1600 కోట్లతో ఈ మూవీ తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి పార్ట్ కోసం రూ.900 కోట్లు.. రెండో పార్ట్ రూ.700 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం.
కాగా రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా.. సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. అలానే పలువురు స్టార్ నటీనటులు సైతం ఇందులో నటిస్తుండడం విశేషం. అయితే ఈ చిత్రానికి సంబంధించి సాయి పల్లవి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీ టౌన్ లో నడుస్తున్న టాక్ ప్రకారం.. సాయి పల్లవి ఏకంగా రూ.12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటోందని అంటున్నారు. సౌత్‌లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు సైతం అందుకు ఒకే చెప్పారని భావిస్తున్నారు. చూడాలి మరి ఈ ముద్దుగుమ్మ హిందీ చిత్ర సీమలో సక్సెస్ అందుకుంటుందా లేదా అని.
-
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !!










Click it and Unblock the Notifications