సాయి పల్లవికి బిగ్ షాక్.. తమిళ ఇండస్ట్రీ బ్యాన్..?
హీరోయిన్ సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి. తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తుంది. తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.

తాజాగా సాయి పల్లవికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. గార్గి సినిమాలో సాయి పల్లవి నటనగానూ ఈ అవార్డు ఆమెకు దక్కింది. ఇదిలా ఉంటే సాయి పల్లవి సాధారణంగా వివదాలకు దూరంగా ఉంటారు. అలాంటిది తొలిసారి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ..ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచేలా కొన్ని కామెంట్స్ చేశారు. సమస్య పరిష్కారానికి హింస కరెక్ట్ కాదు. ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్ధాలు చేశారు. ఇప్పుడు ఆ అవసరం లేదు.
పాక్ వాళ్ళు ఇండియన్ ఆర్మీని, ఇండియన్ వాళ్లు పాక్ ఆర్మీని టెర్రరిస్టులుగా భావిస్తారని ఆమె చెప్పుకొచ్చారు. అప్పట్లో సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు కొందరు కావాలనే వైరల్ చేస్తున్నారు. సాయిపల్లవి చేసిన కామెంట్స్‌పై వారు మండిపడుతున్నారు. ఇండియన్ ఆర్మీని అగౌరవపరిచేలా సాయి పల్లవిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట తమిళ సినిమాల్లో ఆమె తీసుకోవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వివాదాన్ని సాయి పల్లవి లైట్ తీసుకున్నారు.తన సినిమా షూటింగ్‌లతో ఆమె బిజీగా ఉన్నారు. సాయి పల్లవి 'అమరన్' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు.'అమరన్' మూవీలో ఈ బ్యూటీ ఆర్మీ అధికారి భార్యగా నటిస్తోంది. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.












Click it and Unblock the Notifications