విడాకులు తీసుకుంటున్న కరీనాకపూర్ - సైఫ్ అలీఖాన్?
సినీ పరిశ్రమ అన్న తర్వాత ప్రేమించుకోవడాలు.. పెళ్లి చేసుకోవడాలు.. తర్వాత విడిపోవడాలు సహజంగా జరుగుతుంటాయి. తర్వాత విడిపోయినవారు మరొకరని పెళ్లి చేసుకోవడం కూడా అంతే సహజంగా జరుగుతుంటుంది. కొందరు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్నవారు కూడా ఉన్నారు. వనితా విజయ్ కుమార్ లాంటివారు నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై, తనకు కాబోయే భర్తను కూడా పరిచయం చేశారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ స్టార్ హీరో త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లు జరిగాయి. మూడో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
త్రిశూలం గుర్తు వేయించుకున్నాడు
బాలీవుడ్ స్టార్ హీరో, ఇటీవలే దేవర సినిమాలో విలన్ గా నటించిన సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు జహంగీర్ అలీఖాన్, తైమూర్. కరీనాకు, సైఫ్ మధ్య ఎటువంటి విభేదాలు చోటుచేసుకున్నాయనే విషయం మాత్రం బయటకు రాలేదు. కానీ విడాకులు తీసుకోబోతున్నారనేది మాత్రం ఖాయమైంది. బాలీవుడ్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వార్తే. కరీనాకపూర్ ను పెళ్లి చేసుకోవడానికి ముందు సైఫ్ తన చేతిపై ఆమె పేరును పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఇప్పుడు దానికి బదులుగా త్రిశూలం గుర్తు వేయించుకున్నాడు. పరిశ్రమలో మాత్రం ఈ వార్త దుమారం రేపుతోంది.

పచ్చబొట్టు చెరిపించేసుకున్నసైఫ్
పచ్చబొట్టు చెరిపించేసుకున్నాడంటే అర్థం.. కరీనాను వదిలేస్తున్నానే అర్థం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కరీనాతో సైఫ్ కు రెండో పెళ్లి. మొదటిసారిగా 1991లో అమృతసింగ్ తో సైఫ్ అలీఖాన్ కు వివాహం జరిగింది. 13 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సైఫ్ కరీనా కపూర్ ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. నిజంగానే వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారా? లేదంటే వేరే ఏ కారణం చేతైనా టాటూను తీసేశాడా? అనే విషయంలో మాత్రం స్పష్టత రావడంలేదు. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈ విషయంపై అటు సైఫ్ కానీ, ఇటు కరీనాకపూర్ కానీ స్పందించడంలేదు. దేవర సినిమాలో విలన్ పాత్రను అద్భుతగా పోషించిన సైఫ్ కు మరిన్ని ప్రతినాయక పాత్రలు దక్షిణాది నుంచి తలుపు తడుతున్నాయి.












Click it and Unblock the Notifications