ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టిన 'సలార్'
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం సలార్. ప్రస్తుతం పాత రికార్డులకు పాతర వేస్తూ.. ఉన్న రికార్డులను ఊచకోత కోస్తూ ముందుకు దూసుకువెళుతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.625 కోట్లకు పైనే కలెక్షన్స్ రాబట్టింది. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
లాంగ్ వీకెండ్ రావడంతో అంచనాలకు మించిన కలెక్షన్లు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల షేర్ దాటింది. బాహుబలి2, ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో సినిమాగా రికార్డును క్రియేట్ చేసింది. నైజాంలో ఈ సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్లింది. అక్కడ వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. అయితే ఆంధ్ర ప్రాంతం గురించే కాస్తంత ఆందోళన నెలకొంది.

సలార్ తెలుగు వర్షన్ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ250 కోట్ల షేర్ రాబట్టాలి. ప్రస్తుతం కలెక్షన్లను పరిశీలిస్తే 82 శాతం రికవరీ అయ్యింది. జనవరి 1 తర్వాత సంక్రాంతి వరకు ఎటువంటి సెలవులు లేవు. కేవలం శని, ఆదివారాలే ఉన్నాయి. అప్పటికి తెలుగులో అనేక సినిమాలు థియేటర్లలో కిక్కిరిసి విడుదలవుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా వచ్చిన కలెక్షన్ల విషయంలో సలార్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. సినిమా విడుదలైన 11వ రోజున వచ్చిన కలెక్షన్ల విషయంలో ఆర్ఆర్ఆర్, బాహుబలి2 మొదటి స్థానంలో ఉన్నాయి. తాజాగా సలార్ ఈ రెండు చిత్రాలను బీట్ చేసి మొదటిస్థానంలో నిలబడింది. సలార్ విజయవంతం కావడంతో సలార్ 2 చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ సినిమా కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని ప్రభాస్ అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications