Salar Movie Collections: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సలార్..
ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ పార్ట్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా గత 11 రోజులుగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సలార్ మూవీ అందరి అంచనాలను మించిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సలార్ రూ. 650 కోట్లు కలెక్ట చేసే దిశగా దూసుకెళ్తోంది. ఈ మూవీకి ఇప్పటికే రూ. 625 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించింది.
వీకెండ్ డేస్, న్యూ ఇయర్ అన్ని కలిసి రావడంతో దేశ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే రూ. 15 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలాగే ముందుకెళ్తే 650 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ 22న ప్రభాస్ సలార్ పార్ట్ వన్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్న రితీలోనే ఈ మూవీ దూసుకెళ్తోంది. 'సాలార్' ప్రపంచ వ్యాప్తంగా కేవలం 11 రోజుల్లోనే రూ.625 కోట్లు రాబట్టడంతో బాక్సాఫీస్ వద్ద సలార్ కు తిరుగులేకుండా పోయింది.

దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ.360.77 కోట్లు కలెక్ట్ చేసింది. 'సాలార్' జనవరి 1న 48.75 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసినట్లు తెలుస్తోంది. సలార్ పార్ట్ వన్ భారీగా హిట్ కావడంతో మేకర్స్ పార్ట్ 2 నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సలార్ పార్ట్ 2, శౌర్యంగ పర్వం అని పేరు పెట్టారు. సలార్ పార్ట్ 2 రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ రూపొందించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్, కేజీఎఫ్-2 భారీ విజయాలు అందించింది.
ఆ తర్వాత సలార్ పార్ట్ తీసిన ప్రశాంత్ నీల్ మరోసారి భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ప్రభాస్ కూడా బహుబలి తర్వాత భారీ విజయాన్ని అందుకున్నాడు. బహుబలి తర్వాత ప్రభాస్ పని అయిపోయిందని అనుకున్నవారు ఇప్పుడు సలార్ విజయంతో నోరు మూసుకున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications