సలార్: 2వరోజు అలా చెబుతున్నారేంటి?
సలార్ దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదిలిపోతున్నాయి. మొదటిరోజే రూ.180 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం వీకెండ్ లో ఎంత సాధిస్తుందో అనే లెక్కలను ట్రేడ్ పండితులు వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ నిర్మించింది. శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, బాబీ సింహా తదితరులు నటించగా రవి బ్రసూర్ సంగీతాన్ని అందించారు.
మొదటిరోజు మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ అనే టాక్ సొంతం చేసుకుంది. రెండోరోజు, మూడోరోజు అని తేడా లేకుండా అభిమానుంలదరి, సినిమా చూసిన ప్రేక్షకులందరిదీ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ఏకాభిప్రాయంగా వస్తోంది. స్టడీగా కలెక్షన్లను కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రానికి ఉత్తరాదిలో అన్యాయం జరిగిందంటున్నారు. షారుక్ ఖాన్ సినిమా డంకీని ఎక్కవ థియేటర్లలో ప్రదర్శించారు. సలార్ చిత్రానికి కావాలనే థియేటర్లు ఇవ్వలేదంటున్నారు.

ఒకవేళ సరైన సంఖ్యలో థియేటర్లు పడితే తొలిరోజు కలెక్షన్లు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు ఉండేవంటున్నారు. అంతే కాకుండా ఏపీలో కూడా ఆచార్య, సర్కారువారి పాట సినిమాలకు ఇచ్చినంతగా టికెట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చివుంటే కలెక్షన్లు భారీగా వచ్చేవంటున్నారు. అయితే టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ రెండు సినిమాలంత లేవు అనేది అభిమానుల అభిప్రాయంగా ఉంది. ఈ రెండు అంశాలు కలిసొచ్చివుంటే సలార్ దెబ్బకు ప్రపంచం మొత్తం వణికిపోయేదరి, అయినా ఏమాత్రం తగ్గడంలేదని, ర్యాంపేజ్ ఆడిస్తున్నాడంటూ డార్లింగ్ అభిమానులు సంబరంగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి అభిమానులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న భారీ హిట్ ను ప్రభాస్ అందించాడంటున్నారు.












Click it and Unblock the Notifications