బెంగళూరులో 'సలార్' సంచలన రికార్డ్
పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్.. ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? ఎప్పుడెప్పుడు దీన్ని బ్లాక్ బస్టర్ హిట్ చేద్దామా? అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ కు ఆశించిన రీతిలో స్పందన రాలేదు. కానీ మొదటి లిరికల్ వీడియో సాంగ్ సూరీడుకు మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఈ సాంగ్ చూసిన తర్వాత సలార్ లో యాక్షన్, సెంటిమెంట్ రెండూ సమతూకమయ్యేలా ఉందనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ గా మారింది. ఈ సినిమా ప్రివ్యూను పరిశ్రమలోని కొందరు పెద్దలు చూశారు. దీనికి రెస్పాన్స్ బ్రహ్మాండంగా వచ్చింది. సలార్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు భారతదేశ చలనచిత్ర పరిశ్రమలోనే ఎవరూ చూడని రీతిలో ఉండబోతున్నాయంటున్నారు. ప్రధానంగా రెండో భాగంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఫైట్ సన్నివేశం మాత్రం థియేటర్ లో ఊహించడానికే సాధ్యం కావడంలేదంటున్నారు. ఇదొక్కటే కాదని ఈ సినిమాకు సంబంధించి ఎన్నో సస్పెన్స్ లు ఉన్నాయంటున్నారు.

టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తెలుగుకు సంబంధించి నైజాంలో బుకింగ్స్ ముందుగానే ఓపెన్ చేస్తారంటున్నారు. ఈ సినిమాను అక్కడ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. దిల్ రాజు చేతిలో థియేటర్లు ఉండటంతో సలార్ కావల్సినన్ని థియేటర్లు దొరుకుతాయా? లేదా? అనే సస్పెన్స్ కూడా కొనసాగుతోంది.
కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కేవలం పది నిముషాల్లోనే పదివేల టికెట్లు అమ్ముడుపోయాయి. వేరే రాష్ట్రంలోనే పరిస్థితి ఇలావుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమంటున్నారు. ఈ విషయాన్ని డార్లింగ్ అభిమానులు సంబరంగా చెబుతున్నారు. ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా సలార్ థియేటర్లలో విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications