Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షూటింగ్ వదిలి ఆసుపత్రికి పరుగెత్తిన సల్మాన్ ఖాన్.. కారణమేంటి?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్(90) అనారోగ్యంతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చేరారు. మంగళవారం ఉదయం ఆయనకు స్వల్ప అస్వస్థత కలగడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాంద్రాలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వయస్సు 90 ఏళ్లు కావడంతో వైద్యులు ముందు జాగ్రత్త చర్యగా ఆయనను ఐసీయూ విభాగంలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హుటాహుటిన ఆస్పత్రికి సల్మాన్ ఖాన్
సలీం ఖాన్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే సల్మాన్ ఖాన్ తన షూటింగ్ పనులను పక్కన పెట్టి హుటాహుటిన లీలావతి ఆసుపత్రికి చేరుకున్నారు. సుమారు గంటకు పైగా అక్కడే ఉండి వైద్యులతో తండ్రి చికిత్స గురించి చర్చించారు. సల్మాన్ మాత్రమే కాకుండా ఆయన సోదరి అల్విరా ఖాన్, బావ అతుల్ అగ్నిహోత్రి, మనవడు అయాన్ అగ్నిహోత్రి, ఆయుష్ శర్మ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులంతా అక్కడే ఉండి సలీం ఖాన్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.

Salim Khan Hospitalised Salman Khan Father in ICU at 90 Family Rushes to Lilavati Hospital

90 ఏళ్ల వయసులోనూ చురుగ్గా..
సలీం ఖాన్ గతేడాది నవంబర్ 24న తన 90వ పుట్టినరోజును ఎంతో వేడుకగా జరుపుకున్నారు. అంతకు ముందే తన భార్య సల్మా ఖాన్‌తో కలిసి 61వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. 90 ఏళ్ల పైబడినా ఆయన ఇప్పటికీ ఎంతో క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్‌ను గడుపుతున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వాకింగ్‌కు వెళ్లడం, మితాహారం తీసుకోవడం ఆయన అలవాటు. సల్మాన్ ఖాన్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తండ్రి ఇప్పటికీ మంచి భోజన ప్రియుడని, రోజుకు రెండుసార్లు డెజర్ట్స్ కూడా తింటారని సరదాగా వ్యాఖ్యానించారు.

భారతీయ సినీ ఇండస్ట్రీలో లెజెండ్
సలీం ఖాన్ కేవలం సల్మాన్ ఖాన్ తండ్రిగానే కాకుండా, భారతీయ సినిమా రంగాన్ని మలుపు తిప్పిన రచయితగా గుర్తింపు పొందారు. జావేద్ అక్తర్‌తో కలిసి ఆయన రచించిన 'షోలే', 'జంజీర్', 'దీవార్', 'మిస్టర్ ఇండియా' వంటి చిత్రాలు బాలీవుడ్ చరిత్రలోనే మైలురాళ్లుగా నిలిచిపోయాయి. అమితాబ్ బచ్చన్‌కు 'యాంగ్రీ యంగ్ మ్యాన్' అనే ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది కూడా ఈ సలీం-జావేద్ ద్వయమే. రచయితగా మారకముందు ఆయన 'ప్రిన్స్ సలీం' అనే పేరుతో కొన్ని సినిమాల్లో నటుడిగా కూడా అలరించారు.

త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు
సలీం ఖాన్ ఆసుపత్రిలో చేరిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ అభిమానులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా సలీం ఖాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన వయస్సు రీత్యా వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం అందుతోంది. బాంద్రాలోని ఆయన నివాసం గాలక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కూడా కొంతమంది అభిమానులు గుమిగూడి ఆయన క్షేమం కోసం ఆరా తీస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+