గుడ్ బై చెప్పేసిన సమంత
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఈక్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.
ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్‌తో పాటు సమంత కూడా యాక్షన్ సీక్వెన్స్ చేసినట్టు స్పష్టం అవుతోంది. ఇదే విధంగా ఈ వెబ్ సిరీస్‌లో సమంత బొల్డ్‌గా కనిపించారనే టాక్ వినిపిస్తోంది. ట్రైలర్‌లో లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నట్టు చూపించారు. దీంతో వెబ్ సిరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌కు కొదవలేదని అర్ధం అవుతోంది. వరుణ్ ధావన్-సమంతల మధ్య బొల్డ్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది.

తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొత్తం ఆరు ఎపిసోడ్స్‌గానూ రెండు ఎపిసోడ్లు మాత్రమే ఆసక్తికరంగా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదే సమయంలో హీరో వరుణ్ ధావన్‌తో సమంత లిప్ లాక్ సన్నివేశాలున్నాయని చూసిన ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు అన్ని విషయాలను గమనిస్తారని , అందుకే ఏం చేసినా బాధ్యతగా చేయాల్సి ఉంటుంది.
నేను ఓ సినిమా చేస్తున్నానంటే దాని పూర్తి బాధ్యత నా మీదనే ఉంటుందని ఆమె తెలిపారు. అందుకే నేను పాత్రలను ఎంచుకునే సమయంలో ఎన్నో విషయాల గురించి ఆలోచించి ఎంపిక చేసుకుంటాను. ప్రజెంట్ సమాజంలో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని భావిస్తున్నా. సినిమాల్లో కూడా రెండు, మూడు సన్నివేశాలకు పరిమితమయ్యే పాత్రలకు దూరంగా ఉంటా.ఇక మీదట అలాంటి కథలకు గుడ్ బై చెబుతానని అభిమానులకు సమంత హామీ ఇచ్చారు. ఇక మీదట తాను యాడ్స్ చేసే విషయంలో కూడా ఆలోచిస్తానని సమంత చెప్పుకొచ్చారు. నాకు ఎన్నో అవకాశాలు వచ్చినా కొన్నింటినే ఎంచుకున్నాను. నాకు వచ్చిన ఆఫర్లకు నేను చేసిన సినిమాలకు మధ్య చాలా తేడా ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications