పెళ్లి కూతురు గెటప్‌లో సమంత..అతనితో ఫిక్స్ అయినట్టేనా..?

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారామె. ఆర్యోగం సహకరించక పోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి కోలుకుంది.దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతోంది.

విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తర్వాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు. 'సిటాడెల్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌‌లో మాత్రం సమంత నటించారు. అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.ఇదే సమయంలో సమంత చాలాకాలం తర్వాత తన తెలుగు సినిమాను ఎనౌన్స్ చేశారు.'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది.ఈ సినిమాకు సమంతనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Samantha bridal getup photos go viral

ఇదిలా ఉండగా, సమంత తన సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది.ఈ ఫొటో షూట్‌లో సమంత పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనం ఇచ్చింది. ముక్కు పుడక, నుదుటున ఆ ఎర్రటి బొట్టు పెట్టుకుంది.అది ఆమె అందానికే వన్నె తెచ్చిపెట్టింది.అచ్చం నార్త్ సైడ్ పెళ్లి కూతురు గెటప్‌లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. సమంత కొత్త లుక్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. సమంత బాపు బొమ్మలా ఉందని కొందరు కామెంట్స్ చేస్తుంటే, రెండో పెళ్లికి సమంత రెడీ అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత పెళ్లి కూతురు గెటప్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ ప్రచారంపై సమంత మాత్రం నోరు మెదపడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+