న్యూడ్ ఫొటోలపై సమంత షాకింగ్ కామెంట్స్
హీరోయిన్ సమంత నగ్న ఫొటోలు తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. నాగ చైతన్యతో విడాకులు తర్వాత సమంత మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సంగతి అందరికి తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడంతో సినిమాలకు సైతం దూరంగా ఉంటుంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె ఇప్పటి వరకు మరో సినిమాలో కనిపించింది లేదు. ఒకనొక సమయంలో సమంత సినిమాలకు గుడ్ బై చెప్పిందనే మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ పుకార్లకు చెక్ పెడుతూ.. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌తో పాటు, అల్లు అర్జున్ కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే సమంత మయోసైటిస్ వ్యాధికి తాను చికిత్స తీసుకుంటున్న విధానం గురించి పోస్ట్ చేసింది. మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత తనకు జరిగిన చికిత్స గురించి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా అనే వైద్య విధానం, అధునాతన సాంకేతికతతో ఆరోగ్యాన్ని తిరిగి బూస్టప్ చేయడం ఎలానో సమంత ఇన్ స్టాగ్రామ్‌లో వెల్లడించారు. కండరాల పనితీరు మెరుగవ్వడానికి అవసరమైన మెరుగైన చికిత్స ఇది. శరీరంలో కొవ్వును తగ్గించి, అనవసర కండపుష్టిని కరిగించి శరీరాన్ని పునరుజ్జీవింపజేసే ప్రక్రియ ఇది.

అదనపు చెమటలు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గిస్తుందని సమంత వివరించింది. అయితే ఈ చికిత్సా విధానం గురించి వెల్లడించే క్రమంతో సమంత బాత్ టవల్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. దీన్ని కొందరు ఆకతాయిలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ఆప్‌లోడ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇది తెలియని చాలామంది సమంత నగ్న ఫొటోలంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సమంత నగ్న ఫొటోలంటూ వైరల్ చేయడంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా దీనిపై సమంత స్పందించింది. ఆమె తన ఇన్ స్టాలో ఓ కోట్ షేర్ చేసింది. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం లేదా నిరూపించుకోవాల్సిన అవసరం లేకుండా జీవించగలగడమే నిజమైన విజయం అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ షేర్ చేసిన ఈ కొటేషన్ వైరల్ కాగా, సమంత అర్ధనగ్న ఫొటోపై ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టడానికి ఈ కోట్ షేర్ చేసిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications