ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా: సమంత
ఏమాయ చేశావే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కుమారి సమంత కాస్తా నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకొని శ్రీమతి అయింది. 2017లో హఠాత్తుగా విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించి శ్రీమతి కాస్తా మాజీ శ్రీమతి అయింది. నాగచైతన్యను పెళ్లిచేసుకున్నప్పటికన్నా విడిపోయిన తర్వాతే ఎక్కువ ప్రాచుర్యాన్ని సంపాదించుకుంటుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు నాగచైతన్య, సమంతకు సంబంధించిన ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా సమంత తన వదిన నికోల్ జోసఫ్ పోస్ట్ ను తిరిగి షేర్ చేశారు.
వదినను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను
దాని ప్రకారం అర్థం ఏమొస్తుందంటే ప్రపంచంలో ఎంతోమంచి వదినలు ఉంటారు.. తాను తన వదినను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను అని. దీంతోపాటు లవయూ అంటూ సమంత క్యాప్షన్ జోడించింది. వాస్తవానికి తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఎప్పటికప్పుడు ఎంతో స్ఫూర్తివంతమైన కొటేషన్లను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. యువతకు స్ఫూర్తిదాయకంగా ఇవి నిలవాలని కోరుకుంటుంది. ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి చేసిన హనీ బన్నీ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమవుతోంది. అత్యధిక వ్యూస్ ను సాధించడంతో ఇటీవలే యూనిట్ పార్టీ చేసుకుంది.

తన నుంచి తాను స్ఫూర్తి పొందుతాను
ప్రస్తుతం సొంత బ్యానరుపై మా ఇంటి బంగారం సినిమా చేస్తోంది. అలాగే రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. మయోసైటిస్ వ్యాధికి గురైనప్పుడు మానసికంగా కొంత బలహీనపడింది. తర్వాత స్నేహితులు, సన్నిహితుల సహాయంతో కోలుకొని ఆత్మవిశ్వాసంతో తిరిగి సినిమాలు చేయడం ప్రారంభించింది. తన జీవితానికి తానే స్ఫూర్తిగా నిలుస్తానని, ఇతరుల నుంచి స్ఫూర్తిని పొందుతానని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. కరణ్ జోహార్ కాఫీషోలో తొలిసారిగా నాగచైతన్యతో తన విడాకుల గురించి స్పందించింది. ఆ తర్వాత పరోక్షంగా చాలా సందర్భాల్లో నాగచైతన్యపై సెటైర్లు వేయడంతోపాటు విమర్శలు చేసిందికానీ నాగచైతన్య మాత్రం ఎప్పుడూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.












Click it and Unblock the Notifications