యంగ్ హీరోతో సమంత రొమాన్స్.. లిప్ లాక్స్‌కు కొదవ ఉండదేమో..!
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.ఏమాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. ఆ తరువాత తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు.ఇటీవలే తిరిగి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌తో పాటు, తెలుగులో అల్లు అర్జున్ సినిమాలో నటిస్తోంది.

తాజాగా సమంతో మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జోన్నలగడ్డతో రొమాన్స్ చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయితగా వర్క్ చేస్తున్నారు . నాగ వంశీ - త్రివిక్రమ్ భార్య సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నారట. ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. బడా బడా పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్న సరే రిజెక్ట్ చేసి సిద్దు జొన్నలగడ్డ సినిమాకు ఓకే చేయడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. డెస్టిని అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications