శుభవార్త చెప్పిన సమంత

హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు.

నాగ చైతన్య ప్రస్తుతం తాండెల్ అనే మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా, చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఖుషీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సమంత..తన కొత్త సినిమా గురించి క్రేజీ ఆప్డేట్‌ ఇచ్చారు. బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సమంత .. తాజాగా సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ను ''హనీ, బన్నీ'' పెట్టినట్టు చిత్ర యూనిట్ తెలిపారు. తాజాగా సమంతకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

Samantha green signal to atlee and allu arjun movie

అల్లు అర్జున్ కొత్త సినిమాలో సమంతకు హీరోయిన్‌గా అవకాశం దక్కినట్టు సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత తమిళ స్టార్ దర్శకుడు అట్లీతో ఓ మూవీ చేయడానికి బన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అట్లీ వినిపించిన కథ నచ్చడంతో వెంటనే సమంత ఈ సినిమాను ఓకే చేసిందట. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమంత ఇలా తిరిగి సినిమాల్లో నటిస్తుండటంతో ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇలా మళ్లీ సినిమాల్లో నటించడం అభిమానులకు శుభవార్తే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+