ఆ స్టార్ హీరోతో సమంత ఐటం సాంగ్
హీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళను ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు.సమంత మాత్రం ప్రస్తుతానికి ఒంటరిగానే ఉంటున్నారు. అయితే సమంత విడాకుల వెనుక అనేక కారణాలున్నాయని అప్పట్లో బాగానే వార్తలు వినిపించాయి.
వాటిలో సమంత ఐటం సాంగ్ కూడా ఒకటి. పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో నటించడానికి అక్కినేని ఫ్యామిలీ అంగీకరించలేదని, అందుకే ఆమె నాగ చైతన్యకు విడాకులు ఇచ్చారని పుకార్లు షికార్లు చేశాయి. విడాకుల తర్వాత సమంత అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' సినిమాలో ఐటం సాంగ్‌లో నటించారు. 'ఊ అంటావా మామ' అంటూ అల్లు అర్జున్‌తో కలిసి సమంత వేసిన స్టెప్పులు ఇప్పటికి కూడా ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సినిమా సూపర్ హిట్ కావడానికి సమంత ఐటం సాంగ్ కూడా ఓ కారణంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఐటం సాంగ్స్‌లో నటించలేదు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సమంత మరో స్టార్ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్‌లో యాక్ట్ చేయబోతుందట. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. రెగ్యులర్ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం సమంతను సంప్రదించారట చిత్ర యూనిట్. దీనిపై సమంత సైతం సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా 2026లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ , సమంత కాంబినేషన్‌లో సూపర్ హిట్స్ వచ్చాయి. అయితే ఈసారి ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా కాకుండా ఆయన సినిమాలో ఐటం సాంగ్‌లో మాత్రమే సమంత కనిపించనుంది.












Click it and Unblock the Notifications