నాగ చైతన్యకు సమంత కౌంటర్..మళ్లీ అలాంటి రోజులు మాత్రం రాకూడదు

హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.

అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.

Samantha indirect comments on Naga Chaitanya

అసలు వీరిద్దరు ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయం ఇప్పటి వరకు బయటపెట్టలేదు. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ కొద్దిరోజులు సినిమాలకు సైతం దూరం అయింది. వ్యాధి నయం కావడంతో తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని సమంత వెల్లడించారు.గడిచిన రోజులు నా లైఫ్ లోకి రాకూడదని కోరుకుంటున్నానని సమంత వెల్లడించారు.ప్రస్తుతం అంతా బాగానే ఉందని మునుపటి రోజుల కంటే బలంగా అయ్యానని సామ్ పేర్కొన్నారు.ఆ చీకటి రోజుల నుంచి బయటపడితే లైఫ్ లో విజయం సాధిస్తామని సమంత చెప్పుకొచ్చారుదీంతో ఇది సామ్ విడాకుల గురించే ఇన్ డైరెక్ట్‌గా కామెంట్స్ చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+