రూ. 500 కోసం అలాంటి పని చేశా.. సమంత షాకింగ్ కమెంట్స్
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మరో సినిమాకు కమిట్ అయింది లేదు. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలను కూడా ఆపేసినట్టు ప్రచారం జరుగుతుంది.
సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమె పూర్తిగా సినిమాలకు దూరం కావాలని చూస్తున్నారు. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విశేషం. సినిమాలకు దూరం అయినప్పటికీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు

తాజాగా ఓ ఇంటర్య్వూలో సమంత మాట్లాడుతూ తన చిన్నతనంలో జరిగిన విషయాలను అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేసింది. తాను ఓ మధ్యతరగతి అమ్మాయినని..అమ్మ , నాన్న బాగా చదువుకోమని చెప్పేవారని..తాను కూడా బాగా చదువుకునే దాన్ని అని ఆమె చుప్పుకొచ్చింది. కాని కుటుంబ పరిస్థుతుల దృష్ణ్యా చిన్నతనంలోనే పనికి వెళ్లిన రోజులను గుర్తు చేసుకొని సమంత ఎమోషనల్ అయ్యారు.
నేను చదువుకునే రోజుల్లో ఓ స్టార్ హొటల్‌లో ఈవెంట్‌కు వర్క్ చేశానని.. అందుకు నాకు రూ.500 రూపాయిలు ఇచ్చారని తెలిపింది. అదే నా మొదటి సంపాదన అంటూ సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications