రెండో పెళ్లికి రెడీ.. సమంత సంచలన పోస్ట్

హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు ఎక్కుడ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయసైటీస్ వ్యాధి కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత, ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ముఖ్యంగా నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. ఈక్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.

ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. తన మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీంతో సమంత రెండో పెళ్లిపై అనేక గాసిప్స్ తెర మీదకు వచ్చాయి.

Samantha is ready for second marriage

సమంత ఓ స్టార్ దర్శకుడుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగింది. ఆ స్టార్ దర్శకుడు మరెవ్వరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు . రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది.

త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో సమంత సైతం తన రెండో పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. రెండో వివాహం గురించి సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. 2025తనకు పెద్దగా కోరికలు ఏమీ లేవని ఆమె తెలిపారు. ఇదే సమయంలో రెండో పెళ్లిపై ఆమె స్పందించారు. నమ్మకమైన భాగస్వామితో పాటు, పిల్లలు కూడా కావాలని సమంత చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తన నటనను మెరుగుపరుచుకుని , ఆదాయం పెంచుకోవాలని తన ఇన్‌స్టాగ్రామ్ ఆమె తెలిపింది. ప్రస్తుతం సమంత రెండో పెళ్లిపై చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+