తెలుగులో నెంబర్‌వన్ హీరోయిన్ ఆమే!

తెలుగు సినీ పరిశ్రమలో టాప్-10 హీరోయిన్లు ఎవరు అనే అంశంపై ప్రముఖ మీడియా సర్వే చేసింది. అయితే ఫలితాలు ఊహించని రీతిలో రావడంపై అందరూ ఖంగుతున్నారు. సినిమాలు చేయకుండా దాదాపు ఏడాదిన్నర నుంచి ఖాళీగా ఉన్న సమంత ఇప్పటికీ తెలుగులో నెంబర్ వన్ స్థానంలో నిలవడంపై ఎవరూ ఊహించలేదు. ఖుషి తర్వాత తన సొంత బ్యానర్ లో ఓ సినిమా చేస్తోంది. మళయాళంలో మమ్ముట్టి సరసన ఓ సినిమాతోపాటు బాలీవుడ్ లో ఓ సినిమా చేయబోతోంది.

సీనియర్ హీరోలకు అవకాశంగా కాజల్
మన తెలుగులో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ కు హీరోయిన్ల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం వీరికి మంచి అవకాశంగా కాజల్ అగర్వాల్ నిలిచారు. ఇటీవలే బాలయ్యతో భగవంత్ కేసరి నటించారు. అంతకుముందు చిరంజీవితో ఖైదీనెంబరు 150 చేశారు. కాజల్ రెండో స్థానంలో నిలిచింది. తర్వాత స్థానంలో అనుష్క నిలిచింది. కొన్నాళ్ల నుంచి ఏ సినిమా చేయనప్పటికీ అనుష్కశెట్టి మాత్రం మూడో స్థానంలో నిలవడం విశేషం. ఆమె తర్వాత నాలుగో స్థానంలో శ్రీలీల నిలిచింది. తన అందంతోపాటు నృత్యాలతో పరిశ్రమను ఆమె గడగడలాడిస్తున్నారని చెప్పొచ్చు. వరుసగా ఫ్లాప్స్ రావడంతో సినిమాలను ఆచితూచి ఎంచుకుంటోంది.

samantha is the number one heroine in telugu film industry

ఐదో స్థానంలో నిలిచిన సహజమైన అందం
తన సహజమైన అందంతోపాటు అభినయంతో, నృత్యంతో అలరారే సాయిపల్లవి ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం నాగచైతన్యతో ఓ సినిమా, హిందీ రామాయణం చేస్తోంది. నేషనల్ క్రష్ రష్మిక ఆరోస్థానంలో నిలిచింది. చేతినిండా సినిమాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎంతో జాగ్రత్తగా సూపర్ హిట్ సినిమాలే చేస్తూ వస్తోంది. తర్వాత ఏడో స్థానంలో మిల్కీబ్యూటీ తమన్నా నిలిచింది. సీనియర్ హీరోలకు ఈమె కూడా ఓ అవకాశంగా మారారు. ఎనిమిదో స్థానంలో మహానటి కీర్తి సురేష్ నిలిచారు.
బాలీవుడ్ కు వెళ్లే యోచనలో ఉంది. పూజాహెగ్డే తొమ్మిదో స్థానంలో నిలవగా అనుపమ పరమేశ్వరన్ పదోస్థానంలో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+