సమంత బండారం బయటపెట్టిన డాక్టర్
సినిమాలకు దూరంగా ఉన్న సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.
ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాల్లో నటించడం ఆపేసింది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విశేషం. సినిమాలకు దూరంగా ఉన్న సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది. సోషల్ మీడియాలో సమంతకు ఎన్నలేని అభిమానులు ఉన్నారు. సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

33 మిలియన్ల అభిమానులు సమంతను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారంటే అమ్మడు రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజాగా సమంత ఓ సమస్యలో చిక్కుకుంది. సమంత ఇటీవల ఫుడ్‌కు సంబంధించి ఓ వీడియో చేసింది.యూట్యూబ్ పాడ్‌కాస్ట్ పేరిట కొన్ని ఆరోగ్య చిట్కాలను అభిమానులతో పంచుకుంది.
హెల్త్ పాడ్‌క్యాస్ట్ సిరీస్‌లో పాడ్‌క్యాస్ట్ అండర్‌స్టాడింగ్ ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే ఈ వీడియో ప్రముఖ డాక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ది లివర్ డాక్టర్ అనే వ్యక్తి సమంత పోడ్‌కాస్ట్‌పై చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. డాండెలైన్ హెర్బ్ కాలేయ ఆరోగ్యానికి ఉత్తమ ఔషధమని సమంత చెప్పడం సరికాదని అతను తెలిపాడు.
అవగాహన లేకుండా ఫాలోవర్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని డాక్టర్ తన పోస్ట్ ద్వారా సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సమంత తన 33 మిలియన్ల ఫాలోవర్లకు తప్పుదోవ పట్టిస్తుందని సమాచారం తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్లు, వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై సమంత ఎలా రియాక్ట్ అవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు..
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications