శోభిత ధూళిపాళ ఇంట్లో సమంత సందడి
సమంత, నాగ చైతన్య ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. సమంత ఒంటిరిగా ఉండగా, నాగ చైతన్య మాత్రం విడాకుల తర్వాత శోభిత ధూళిపాళతో నాగ చైతన్య సైలెంట్‌గా డేటింగ్ చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను వివాహం చేసుకోవడానికి రెడీ అయ్యాడు. నాగ చైతన్య, శోభిత ధూళిపాళ నిశ్చితార్థం సింపుల్‌గా జరిగిన సంగతి తెలిసిందే.
అతి కొద్దిమంది సమక్షంలో నాగ చైతన్య, శోభిత ధూళిపాళల నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. ఈక్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించి కీలక ఘట్టం ఆ మధ్య జరిగింది.నాగ చైతన్య -శోభిత ధూళిపాళల పెళ్లికి సంబంధించిన పనులు మొదలయ్యాయి. దీనిలో భాగంగానే శోభిత ధూళిపాళ నివాసంలో పసుపు కొట్టే కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫొటోలను శోభిత ధూళిపాళ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ కుటుంబ సభ్యులు మొత్తం కూడా పాల్గొన్నారు.

శోభిత ధూళిపాళ తన హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలను సైతం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. తాజాగా తనని పెళ్లి కూతుర్ని చేస్తోన్న ఫొటోలను శోభిత షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకొని ఒంటి నిండా నగలు వేసుకొని రెడీ అయ్యింది. అంతేకాకుండా ఈ పిక్స్‌కు 'పెళ్లి కూతురు' అనే క్యాప్షన్‌ను జోడించింది. ఈ ఫొటోల్లో శోభిత ధూళిపాళ చెల్లెలు సమంత స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అక్క నిశ్చితార్థానికి దూరంగా ఉన్న సమంత, పెళ్లి పనులు మాత్రం దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రస్తుతం శోభిత ధూళిపాళ పెళ్లి కూతురు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications