అతనితో బంధాన్ని కన్ఫర్మ్ చేసిన సమంత..చేతిలో చేయి వేసి మరీ..!
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు.

ఇటీవల సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది.
ఇక ముంబైలో ఒకే కారులో వెళ్తూ ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. దుబాయ్ ఫ్యాషన్ వీక్‌కు వెళ్లిన నటి సమంత చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్‌లో, ఆమె ఒక వ్యక్తి చేయి పట్టుకుని ఉన్న వీడియోను షేర్ చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది ఆమె స్పష్టంగా చెప్పలేదు.నెటిజన్లు, అభిమానులు ఆ చేయిని పరిశీలించి, 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుదేనని గుర్తించారు.
ముఖ్యంగా ఆ చేతికి ఉన్న బ్రాస్‌లెట్ ఆధారంగా ఇది రాజ్ చేతి అని నిర్ధారణకు వచ్చారు. ఆ బ్రాస్‌లెట్ గతంలో రాజ్ నిడిమోరు ధరించిన బ్రాస్‌లెట్ ఒకటే అని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట మరోసారి తమ బంధాన్ని బయటపెట్టినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో రాజ్‌తో సమంత డేటింగ్ పక్కా అని నెటిజన్లు కన్ఫామ్ చేసుకుంటూ ఈ జంట కంగ్రాట్స్ చెబుతున్నారు.డేటింగ్ కన్ఫామ్ చేశారు సరే పెళ్లి ఎప్పుడంటూ మరికొంతమంది వీరిని ప్రశ్నిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్‌లో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications