రామ్ చరణ్ పక్కన ఆంటీలా ఊహించుకోలేను ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ సినిమా తరువాత ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టిన దర్శకుడు .. నటీ, నటుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా సినిమాలో ఓ ముఖ్యమైన క్యారెక్టర్ కోసం హీరోయిన్ సమంతను సంప్రదించాడట దర్శకుడు బుచ్చిబాబు.

అయితే కథ మొత్తం విన్న సమంత ఈ సినిమా తాను చేయలేనని చెప్పి బుచ్చిబాబు గట్టి షాకే ఇచ్చింరట. మొదట సినిమాలో హీరోయిన్ పాత్ర అనుకొని కథ విన్న సమంతకు తరువాత తనది కేవలం అతిథి పాత్రే అని తేలియడంతో ఈ సినిమా చేయనని చెప్పిన్నట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు సినిమాలో తన రోల్ అంటీలా ఉందనే కారణంతోనే సమంత రామ్ చరణ్ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం.

గతంలో రామ్ చరణ్ - సమంత కాంబినేషన్‌లో రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు రామ్ చరణ్‌తో సినిమా తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు.












Click it and Unblock the Notifications