రూ.200 కోట్ల ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ సంపాదన ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. స్టార్ హీరోకు 90 ఏళ్లు వచ్చినా హీరో పాత్రల్లోనే నటిస్తారు. కానీ హీరోయిన్లు అలా కాదు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లు వాళ్లకుండే ఆ 4-5 ఏళ్ల కెరీర్ లోనే జీవితాంతం సరిపోయేలా సంపాదించుకోవాలి. ఒక్క ప్లాఫ్ తో హీరోకు ఏమీకాదు కానీ అదే ప్లాఫ్ హీరోయిన్ కెరీర్ కు ఎంతో రిస్క్ అని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తుంటాయి.

Samantha Rejects Rs 200 Crore Maintenance Offer in Divorce with Naga Chaitanya

అయితే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ ఏకంగా రూ. 200కోట్ల ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట. ఏంటీ రూ. 200కోట్లా.. ? అంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూ అన్ని కోట్లు రావేమో ఒక్క సినిమాకు. మరి ఇంత పెద్ద జాక్ పాట్ ను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా..? ఆమె ఎవరో కాదు మన సమంత. ఇప్పుడేమే గానీ ఓ పదేళ్ల క్రితం చూడాలి.. అమ్మడి రచ్చ. ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ హిట్టే.. యువతలో ఎవర్ని కదిపినా సామ్ నామం జపిస్తూ ఉండేవారు. అంతలా మాయ చేసింది ఈ బ్యూటీ.

తాజాగా సమంత విడాకులు, భరణం మేటర్ మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ప్రముఖ క్రికెటర్ చాహల్, ధనశ్రీ విడాకులు జరిగాయి. దీంతో మళ్లీ సమంత, నాగ చైతన్యల విడాకుల విషయం తెరపైకి వచ్చింది. సమంత.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్నప్పుడు రూ.200 కోట్లు భరణం వదులుకుందని సమాచారం. ఇందులో భాగంగా విడాకుల సమయంలో సమంతకి అక్కినేని కుటుంబ సభ్యులు రూ.కోట్లు విలువ చేసే ఇల్లు, ఖరీదైన బంగారు ఆభరణాలు, షేర్లు.. ఒక్కటేమిటి దాదాపుగా రూ.200 కోట్లు పై చిలుకు విలువ చేసే ఆస్తులను ఆఫర్ చేసినప్పటికీ సామ్ మాత్రం వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఇప్పటివరకూ ఎవరూ ప్రకటన చేయలేదు.

Take a Poll

ఇక సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఆమె తన ఇన్‌ స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా లోనే తన అభిమానులతో కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతిరోజూ కొత్త పిక్స్ ను ఇన్‌ స్టాలో షేర్ చేస్తూనే ఉంటుంది. మరోవైపు సమంతో విడాకుల తర్వాత నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సామ్ కూడా కొత్త లైఫ్‌ను మళ్లీ మొదలు పెట్టాలని ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఎప్పటినుంచో ఆమెను కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+