నాగ చైతన్యకు షాక్..అతని వైపే సమంత మొగ్గు

'ఏమాయ చేశావే' సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన 'దూకుడు' సినిమాతో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా సమంత ఎదిగారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలతో సమంత నటించారు. ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. సమంత హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.

ఇదే సమయంలో సమంత కొంతకాలం మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డారు. ఆర్యోగం సహకరించక పోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' తరువాత ఆమె మళ్లీ వెండితెర మీద కనిపించింది లేదు. బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం ఆమె కనిపించారు.ఈ క్రమంలోనే బాలీవుడ్ 'సిటాడెల్ (హనీ, బన్నీ)' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.

Samantha reveals her three favorite people in the film industry

ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హీరో వరుణ్ ధావన్‌తో ఘాటైన లిప్ లాక్ సన్నివేశాల్లో సమంత నటించారు. ప్రస్తుతం సమంత చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.సమంత నిర్మాతగా కూడా మారబోతున్నారు. ఆమె నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతుంది. 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై మొదటి ప్రాజెక్ట్‌గా 'శుభం' (shubam) షూటింగ్ పూర్తైనట్లు సమంత వెల్లడించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్‌ సమంతను ఆసక్తికరమైన ప్రశ్నను సంధించాడు.

మూడు చాక్లెట్లు ఇచ్చి ఇవి ఇండస్ట్రీలో ముగ్గురు స్వీట్‌ పర్సన్స్‌కి ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారని సమంతను సదరు రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి సమంత సైతం తనదైనశైలిలో జవాబిచ్చింది. తనకు సినిమాల్లో తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌‌కి మొదటి చాక్లెట్ ఇస్తానని చెప్సిన సమంత, తన లక్కీ హీరో విజయ్‌కు రెండో చాక్లెట్ ఇస్తానని చెప్పుకొచ్చింది. విజయ్‌తో తాను నటించిన సినిమాలన్నీ కూడా హిట్ అని ఈ సందర్భంగా సమంత తెలిపింది. ఇక దర్శకుడు అట్లీకి మూడో చాక్లెట్ ఇస్తానని, ఆయన తన సినిమాల్లో హీరోయిన్‌గా తనకే ఎక్కువ అవకాశాలిచ్చారని, అందుకే ఆయనకే మూడో చాక్లెట్ ఇస్తానని సమంత వెల్లడించింది. అయితే సమంత తెలుగు నుంచి ఒక్కర్ని కూడా ఎంపిక చేసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+