రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్..? తిరుమలలో ప్రత్యక్షమైన జంట
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'ఏమాయ చేశావే'' సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ''దూకుడు'' సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది.
టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తర్వాత సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడాయి. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడ్డ సమంత , కోలుకున్న తర్వాత వరుస సినిమాలు చేస్తోంది. ''సిటాడెల్'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది.ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌లో ఓ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
ఆ దర్శకుడు మరెవరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది.
త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో సమంత చేతికి కొత్తగా ఉంగరం దర్శనం ఇచ్చింది. ఇటీవలే సమంత నిర్మాతగా మారి శుభం అనే సినిమాను తెరకకెక్కించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సమంత చేతికి ఉంగరం కనిపించింది.
She holds the kind of beauty that makes you forget how to speak, lost in a moment that feels like a dream @Samanthaprabhu2! 😍
— Samantha FC || TWTS™ (@Teamtwts2) April 19, 2025
🔗 https://t.co/tG3hraSulg #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/M1lPgBkd5d
దీంతో రహస్యంగా సమంత ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సమంత తిరుమతికి వెళ్లడం, ఆమెతో పాటు రాజు నిడుమోరు కూడా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అయితే తమ రిలేషన్‌పై సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. మరోవైపు సమంత చేతికి ఉన్న రింగ్‌తో పాటు, రాజు నిడుమోరుతో కలిసి తిరుపతి వెళ్లిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications