నాగచైతన్యపై నిఘా పెట్టాల్సింది... తప్పు చేశా: సమంత

అందాల ముద్దుగుమ్మ సమంత బాలీవుడ్ మీడియా ఆర్మాక్స్ ప్రకటించిన సెప్టెంబరు నెల జాబితాలో దేశంలో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలిచింది. సిటాడెల్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ రీమేక్ హన్నీబన్నీకి సంబంధించిన ప్రమోషన్లలో పాల్గొంటూ వార్తల్లో నిలవడంతో దేశవ్యాప్తంగా ఆమె పేరు అందరి నోళ్లల్లో నానింది. దీంతో సహజంగానే అందరి హీరోయిన్లకన్నా టాప్ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో హన్నీబన్నీకి సంబంధించిన కార్యక్రమాలు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ అనేక విషయాలను విలేకరులతో పంచుకుంటోంది.

నిజ జీవితంలో స్పైగా చేశారా?
ఈ సిరీస్ లో సమంత స్పై ఏజంట్ గా నటించింది. ఇందులో ఆమె చేసిన పోరాట దృశ్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ సమంతను ఓ ప్రశ్న అడుగుతుంది. ఈ సిరీస్ లో మీరు స్పై ఏజంట్ గా నటించారుకదా.. నిజ జీవితంలో కూడా స్పైగా నటించారా? అని అడగ్గా దానికి సామ్ బదులిస్తూ నిజ జీవితంలో కూడా తాను అలాగే చేయాల్సిందని, అలా చేయకుండా చాలా తప్పు చేశానని, స్పైగా చేయకుండా ఉండటంవల్లే తన జీవితం ఇలా తయారైందని బదులిచ్చింది. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సమంత-నాగచైతన్య వివాహ బంధం గురించే అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

samantha sensational comments on naga chaitanya lifestyle before divorce

ప్రైవేటు పార్టీ ఫొటోలు
సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే నాగచైతన్య-శోభిత చాలాసార్లు బయట కనపడ్డారు. వెకేషన్లకు వెళుతూ, విదేశాలకు వెళుతూ కనపడటంతో వీరిద్దరూ విడిపోవడానికి నాగచైతన్యే కారణమనే సందేహం అందరిలో నెలకొంది. నాగచైతన్య-శోభిత ప్రైవేటు పార్టీ ఫొటోలు కూడా ఆ సమయంలోనే బయటకు వచ్చాయి. సమంతతో విడిపోకముందే శోభితతో నాగచైతన్య రిలేషన్ నడపడం.. దాన్ని సమంత కనిపెట్టలేకపోవడం జరిగిందని, అలా జరిగివుంటే సమంత జాగ్రత్తపడేదని, తీరా అంతా జరిగిపోయిన తర్వాత బాధపడి ఉపయోగం లేదని సమంత అభిమానులు అంటున్నారు. నాగచైతన్య-శోభిత రిలేషన్ సమంతతో విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లిదాకా వెళతారని ఎవరూ ఊహించలేకపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+