సంచలనంగా సమంత సెల్ఫీ.. ఆ ఫింగర్ చూపిస్తూ.. వారికి సైలెంట్ షాక్!!

నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఎంగేజ్మెంట్ ఆగస్టు 8వ తేదీన గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. నాగార్జున కుటుంబానికి అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య నిశ్చితార్థం జరగగా అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో చైతు శోభితల నిశ్చితార్థాన్ని ధ్రువీకరించారు. ఇద్దరూ సంతోషంగా జీవించాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని, ఆశీర్వదిస్తున్నామని వెల్లడించారు.

నాగచైతన్య ఎంగేజ్మెంట్ తర్వాత సమంత పైన వార్తలు
ఇక అక్కినేని ఫ్యాన్స్ నాగచైతన్య శోభిత దూళిపాళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే కొందరు సమంత ఫ్యాన్స్ మాత్రం నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ తో సమంతకు అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. శోభిత వల్లే సమంత నాగచైతన్యతో విడిపోయింది కావచ్చు అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. ఇదిలా ఉంటే నాగచైతన్య శోభిత దూళిపాళ ఎంగేజ్మెంట్ తర్వాత సమంత పైన కూడా పుకార్లు షికార్లు చేశాయి.

Samantha Sensational selfie showing middle finger silent shock for nagachaitanya sobitha

సెల్ఫీ పోస్ట్ చేసిన సమంత
సమంత కూడా ఒక స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడియోర్ తో సమంత డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా ఒక సెల్ఫీ ని పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టులో సమంత లుక్ పై నెటిజెన్లు తమదైన అర్థాలు చెబుతున్నారు.

పోస్ట్ తో చాలా చెప్పిన సమంత
సమంత ఇన్స్టాల్ లో పోస్ట్ చేసిన సెల్ఫీ పోస్టులో ఒక స్వెట్ షర్ట్ వేసుకొని కూల్ గా గాగుల్స్ పెట్టుకొని ముఖం పైన మిడిల్ ఫింగర్ కెమెరా యాంగిల్ లో కనిపించేలా పెట్టి సెల్ఫీ దిగారు. ఇక ఆ స్వెట్ షర్ట్ మీద ది మ్యూజియం ఆఫ్ పీస్ అండ్ క్వయిట్ అని రాసి ఉంది.

ఆ ఇద్దరికీ ఇచ్చి పడేసిన సమంత
అయితే ఆమె దిగిన ఫోటో ఫోజులో ముఖంపై కేవలం మిడిల్ ఫింగర్ మాత్రమే కనిపించే విధంగా పెట్టడంతో సమంత అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపైన నాగచైతన్య శోభిత ధూళిపాళ్లకు ఒక్క సెల్ఫీ పోజుతో ఇచ్చి పడేసావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

సమంత పోజ్ డీకోడ్ చేస్తున్న అభిమానులు
అంతేకాదు సమంత పర్సనల్ లైఫ్ గురించి డైరెక్టర్ తో సమంత డేటింగ్ చేస్తుందని, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని జరుగుతున్న ప్రచారానికి కూడా సమంత మధ్య వేలు చూపిస్తూ ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టుగా సమంత ఫ్యాన్స్ విశ్లేషిస్తున్నారు. ఇక ఆమె పెట్టిన పోస్ట్ కు నౌ వుయ్ ఆర్ ఫ్రీ అనే ఇంగ్లీష్ పాటను జోడించి సమంత ట్వీట్ చేశారు.

రూమర్స్ పైనా సమంత సైలెంట్ షాక్
తనపై వస్తున్న రూమర్స్ పైన తన గురించి జరుగుతున్న చర్చ పైన చాలా కూల్ ఫేస్ తో అందరికీ మిడిల్ ఫింగర్ చూపించేసి ఎలాంటి రూమర్లను తాను పట్టించుకునేది లేదని తేల్చి చెప్పారు సమంత అంటూ సమంత ఫ్యాన్స్ ఆమె పెట్టిన పోస్ట్ ను డీ కోడ్ చేసి పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి తన గురించి జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సమంత అందరికీ సైలెంట్ గా ఇచ్చి పడేసారని ప్రస్తుతం చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+