ఆ హీరోపై క్రష్‌ను బయటపెట్టిన సమంత
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాలను కూడా ఆపేసింది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడం విశేషం. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.
తాజాగా సమంత ఇండియా టుడే సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. "నా కెరియర్లో 14 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. అన్నింటికి నేను భయపడిపోయాను. భయం వల్లే నా కెరియర్ చాలా సంవత్సరాలు గడిచిందని బయటి వాళ్లకు ఇది చాలా సుదీర్ఘమైన సమయం లాగా కనిపించవచ్చు.14 సంవత్సరాలపాటు నా శరీరానికి, నా మెదడుకు నేను విశ్రాంతి ఇవ్వలేదు. ఒకరోజు ఉదయం లేవగానే నేను ఉండను.. నేను ఎంత ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ నాకున్న వ్యాధి కారణంగా ఆస్వాదించలేకపోయాను.

అయినప్పటికీ నాకు నేను సర్ది చెప్పుకున్నానని" సమంత వ్యాఖ్యానించింది. ఇక తెలుగు ఇండస్ట్రీలో నాకు అల్లు అర్జున్ అంటే క్రష్ అని చెప్పిన సమంత, బాలీవుడ్‌లో షారుక్ ఖాన్ అంటే ఇష్టమని తెలిపింది. అల్లు అర్జున్ వల్లే పుష్ప సినిమాలో ఐటం సాంగ్ చేశానని సమంత చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ నటన అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన యాక్టింగ్‌లో వైవిధ్యాన్ని చూపిస్తారని అల్లు అర్జున్‌పై తన ప్రేమను మరోసారి బయటపెట్టింది.

'ఫ్యామిలీ మెన్'' వెబ్ సిరీస్ తనకు చాలా చెడ్డ పేరు తీసుకువచ్చిందని.. దీని కారణంగానే తాను తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నట్టు సమంత పేర్కొంది. ఆ సినిమాలో తన నటన వల్ల ఎవరైనా ఇబ్బందిపడి ఉంటే క్షమించాలని కోరింది. ఈ వెబ్ సిరీస్ కారణంగానే సమంత , నాగ చైతన్యలు విడిపోయారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఆ వెబ్ సిరీస్‌లో నటించినందుకు సమంత క్షమాపణలు కోరడం సంచలనంగా మారింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
ఏం వైర్లు కెలికేశావ్ "మార్క్ జుకర్‌బర్గ్" మామ.. ఇన్ స్టాగ్రామ్ డౌన్ !! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications