నాగ చైతన్యకు సమంత కౌంటర్..? రూల్స్ పెడితే ఇదే గతి
హీరోయిన్ సమంత ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాగ చైతన్య, సమంత జీవితం తెరిచిన పుస్తకమే.హీరో నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు.ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు.పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకున్నారు.సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్‌లో ఉన్నాడు.

నాగ చైతన్య శోభితతో ఉన్న తన బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నాడు.ఈక్రమంలోనే సైలెంట్‌తో శోభితను రెండో వివాహం చేసుకున్నాడు.సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు.అయితే విడాకులు తర్వాత ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు.నాగచైత్యన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె.విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు. 'సిటాడెల్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మాత్రం సమంత నటించారు.అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మయసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇప్పుడిప్పుడే కోలుకుంది.దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా సిడ్నీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. రూల్స్ పెడితే తనకు నచ్చదని.. నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకుంటున్నానని సమంత చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సక్సెస్ అంటే గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడం కూడా విజయంలో ఒక భాగమే అంటూ ఆమె చెప్పుకొచ్చారు.సినిమాల్లో తనకు నచ్చిన పాత్రలు చేస్తానని,అప్పుడే నా లైఫ్ సక్సెస్ అవుతుందని తెలిపారు. అయితే సమంత చేసిన ఈ వ్యాఖ్యలు నాగ చైతన్యను ఉద్దేశించి చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సమంతపై అక్కినేని కుటుంబం ఆంక్షలు విధించడం వల్లే ఆమె విడాకులిచ్చి ఉంటుందని వారు కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం సమంత కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications