ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా కారులో దొరికిపోయిన సమంత..!
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు.

తాజాగా సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది. ఆ మధ్య సమంత తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది.
సమంత అందమైన లొకేషన్స్‌లో ఫొటోలకు ఫోజులిస్తూ, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.సమంత షేర్ చేసిన ఫొటోలలో రాజ్ నిడిమోరు సైతం దర్శనం ఇచ్చారు.సామ్ పోస్ట్ చేసిన ఫొటోస్‌లో రాజ్ నిడిమోరు సమంత భుజంపై చేసి వేసి దిగిన ఫొటోను షేర్ చేసింది. తాజాగా ఈ జంట మరోసారి కలిసి దర్శనం ఇచ్చారు. వీరిద్దరు కారులో కలిసి వెళుతూ కనిపించారు.దీంతో ఈ జంట మరోసారి తమ బంధాన్ని బయటపెట్టినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దీంతో రాజ్‌తో సమంత డేటింగ్ పక్కా అని నెటిజన్లు కన్ఫామ్ చేసుకుంటూ ఈ జంట కంగ్రాట్స్ చెబుతున్నారు.డేటింగ్ కన్ఫామ్ చేశారు సరే పెళ్లి ఎప్పుడంటూ మరికొంతమంది వీరిని ప్రశ్నిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య రిలేషన్‌లో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ, ప్రస్తుతం సమంత-రాజు నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications