ఆ ప్రశ్నకు సమంత షాక్.. ముఖం మాడిపోయింది!

మనదేశంలోని ఇతర చలనచిత్ర పరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్ ధోరణి వేరుగా ఉంటుంది. అక్కడి హీరోయిన్లు చాలా చిన్న చిన్న దుస్తులు ధరిస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు. దుస్తుల విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు చాలా పొదుపు పాటిస్తారనే విషయం ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్లు సైతం కురచ దుస్తులే వేసుకుంటుంటారు. అయితే ఇదంతా కేవలం తెరమీదే. విడిగా మాత్రం ఎవరి జీవితం వారిదే. ఎలా అయినా ఉండొచ్చు. కొంతమందైతే హీరోయిన్లు వేసుకుంటున్న దుస్తులవల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయనేవారున్నారు.

కోల్ కతాలో శిక్షణలో ఉన్న వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత దేశవ్యాప్తంగా మహిళల భద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటన జరిగినరోజు నుంచి సామాజిక మాధ్యమాల్లో ఇవే ప్రశ్నలు అందరికీ ఎదురవుతున్నాయి. అయితే ఇటువంటివాటిపై సెలబ్రిటీలు స్పందిస్తే వాటికి మరింత ప్రాచుర్యం వస్తుందని విలేకరులు భావిస్తారు. అందుకే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంతను ఓ విలేకరి ఇదే ప్రశ్న వేశారు. అయితే ఆ ప్రశ్నకు సమంత ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇవ్వలేకపోయింది.

Samantha was shocked by the reporter s question on women safety

విలేకరుల నుంచి సినిమాలకు సంబంధించిన ప్రశ్న వస్తుందనే భావనతో ఎదురుచూస్తున్న సమంత మహిళల భద్రతపై ప్రశ్న రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏం సమాధానం చెప్పాలి అన్న విషయంలో ఇబ్బంది పడింది. ఒక నిముషం సమయం ఆమె ముఖ కవళికలు పూర్తిగా మారిపోయాయి. నేటితరం మహిళలకు భద్రతే ప్రధానమని చెప్పింది. తర్వాత నెటిజన్లు పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా మావా పాటను ప్రస్తావించారు. నటీమణుల వేషధారణలను చూసిన తర్వాత మహిళల భద్రతపై ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారా అంటున్నారు. సమంత ముఖంలో వచ్చిన మార్పుల గురించి కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+