నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత తొలి రియాక్షన్ అదిరిపోయింది..!

సమంత , నాగ చైతన్యల జంట ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా అందరికి షాకిస్తూ నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నాడు.

నాగ చైతన్య , శోభిత ధూళిపాళ గురువారం సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడంతో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైవాహిక జీవితంలో సమంత కరెక్ట్‌గానే ఉందని, నాగ చైతన్య అలా ఉండలేకపోయాడని ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శోభితాలో ఉన్నది ఏంటి..? సమంత లేనిది ఏంటని అభిమానులు నాగ చైతన్యను ప్రశ్నిస్తున్నారు.

Samantha s first reaction on Naga Chaitanya s second marriage

ఇదిలా ఉంటే నాగ చైతన్య , శోభిత ధూళిపాళల పెళ్లి గురించి సమంత ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే సమంతను తాను పెళ్లి చేసుకుంటానని ఓ ఫ్యాన్ చేసిన ప్రపోజల్‌కు మాత్రం ఆమె రియాక్ట్ అయ్యారు. ముఖేష్ అనే అభిమాని సమంతపై తనకున్న ప్రేమను వ్యక్త పరుస్తూ ఒక రీల్ చేసి పోస్ట్ చేశారు. 'సమంతా.. నువ్వు బాధ పడాల్సిన అవసరం అస్సలు లేదు. నీకు నేనున్నాను. నువ్వు నేను క‌లిస్తే ఒక మంచి జంట అవుతుంది. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకోవ‌డానికి రెడీగా ఉన్నాను. నాకోక 2 ఇయ‌ర్స్ టైం ఇవ్వు దండిగా డ‌బ్బులు సంపాదిందించి నీ ద‌గ్గ‌రికి వ‌స్తాను.

అప్పటివ‌రకు నా గుర్తుగా ఈ పువ్వు అదే నా హార్ట్‌ను ఉంచుకో' అని అందులో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. దీంతో వెంటనే సమంత సైతం ఈ వీడియోపై స్పందించింది. 'నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయ్యాను.. రీల్ కన్నా నీ బ్యాగ్రౌండ్ లో ఉన్న జిమ్ నన్ను బాగా ఆకట్టుకుంది' అని కామెంట్ చేసింది. దీంతో ముఖేష్ ఆనందానికి హద్దుల్లేవు. సమంతను ట్యాగ్ చేస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. 'సమంత ఇచ్చిన రిప్లై నా రోజును పూర్తిగా మార్చేసింది.

సమంతకు వెయ్యి మంది ఫ్యాన్స్ ఉంటే అందులో నేను కూడా ఒకడిని. అదే ఒక్కరే అభిమాని అంటే అది నేనే. సమంతకు ఎవరూ అభిమానులు లేరంటే భూమి మీద నేను కూడా లేనట్లే' అని సామ్ పై ప్రేమను కురిపించాడు ముశేష్. ముశేష్ నాగ చైతన్య , శోభిత ధూళిపాళ పేర్లను మెన్షన్ చేసినప్పటికి సమంత దీనిపై రియాక్ట్ అవడమే అసలు విశేషం. ఓ విధంగా ఫ్యాన్ ప్రపోజల్‌కు ఓకే చెప్పి నాగ చైతన్య రెండో పెళ్లిపై సమంత గట్టి కౌంటర్ ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+