అతనితో బంధానికి సమంత గ్రీన్ సిగ్నల్ ..పెళ్లి డేట్ ఫిక్స్ ..?
గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాజు నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదు.

ఇటీవల సమంత నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాకు అన్ని పనులు రాజు నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు. ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫొటోను షేర్ చేసింది. రాజు నిడుమోరు భుజంపై తాను వాలిన ఫొటోను సమంత పోస్ట్ చేసింది.
ఇక ముంబైలో ఒకే కారులో వెళ్తూ ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. ఇటీవలే సమంత ప్రియుడితో కలిసి జిమ్ నుంచి బయటకు వస్తోన్న వీడియో సైతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. దుబాయ్ ఫ్యాషన్ వీక్‌కు వెళ్లిన నటి సమంత చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్‌లో, ఆమె ఒక వ్యక్తి చేయి పట్టుకుని ఉన్న వీడియోను షేర్ చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనేది ఆమె స్పష్టంగా చెప్పలేదు.నెటిజన్లు, అభిమానులు ఆ చేయిని పరిశీలించి, 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుదేనని గుర్తించారు.
దీంతో రాజ్‌తో సమంత డేటింగ్ పక్కా అని నెటిజన్లు కన్ఫామ్ చేసుకుంటూ ఈ జంట కంగ్రాట్స్ చెబుతున్నారు.డేటింగ్ కన్ఫామ్ చేశారు సరే పెళ్లి ఎప్పుడంటూ మరికొంతమంది వీరిని ప్రశ్నిస్తున్నారు.తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ సంవత్సరం కార్తీకమాసం ప్రారంభమైన వెంటనే నవంబర్ నెలలో వీరిద్దరి వివాహ ముహూర్తం ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా, ఈ జంట ఈ నవంబర్‌లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. సమంత కొత్త ప్రాజెక్టులను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం పెళ్లి ఏర్పాట్లేనని, అందుకే ఈ విరామాన్ని తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ మోస్ట్ అవైటెడ్ పెళ్లి తేదీపై ఆ జంట నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications