సమంత వెంట ప్రియుడు..? వెకేషన్ ఫొటోలు లీక్
హీరోయిన్ సమంత క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సమంత, తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది.ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకున్నారు. అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది.నాగ చైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
సమంతతో విడాకులు తర్వాత నాగ చైతన్య మరో వివాహం చేసుకోగా, సమంత మాత్రం సింగిల్‌గానే కొనసాగుతోంది.విడాకుల అనంతరం సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది.ఇటీవలే సమంత ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు.తన 15 ఏళ్ళ కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ..అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు.. మరెన్నో చేదు అనుభవాలున్నాయంటూ చెప్పుకొచ్చింది. జీవితంలో కొన్ని విషయాలు ఎంత మర్చిపోవాలన్నా మరిచిపోలేం అని.. కొన్ని మాత్రం ఇట్టే మరిచిపోతామంటూ సమంత తెలిపింది.

ఇదిలా ఉంటే సమంత తాజాగా తన వెకేషన్ ఫోటోలు రిలీజ్ చేసింది. తాజాగా సమంత సిడ్నీలోని వన్యప్రాణుల పార్క్‌లో హాలిడే పిక్స్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రకృతి, జంతువులు, మంచి వైబ్స్ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె ఈ టూర్‌కి సింగిల్‌గానే వెళ్లిందా? లేదా ప్రియుడు ఉన్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో డేటింగ్ చేస్తోన్నట్టు ప్రచారం జరుగుతోంది.
వీరిద్దరు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. సమంత ఇటీవల నటించిన 'సిటాడెల్' వెబ్ సిరీస్‌కు సైతం రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల వీరిద్దరు కలిసి పలుచోట్ల దర్శనం ఇచ్చారు. ఇప్పుడు సమంత వెకేషన్‌లో కూడా రాజు నిడుమోరు ఉండి ఉంటారనే అనుమానాన్ని నెటిజన్లు వ్యక్తం చేస్తున్నరు.












Click it and Unblock the Notifications