సరిదిద్దుకోలేని తప్పు చేసిన సమంత..!

స్టార్ హీరోయిన్ సమంత తన వృత్తిపరమైన జీవితంలో ఎంత బిజీగా ఉంటుందో, వ్యక్తిగత విషయాలతోనూ అంతే స్థాయిలో వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె జీవితంలో చోటుచేసుకుంటున్న సంఘటనలు, సంబంధాలు నిరంతరం చర్చనీయాంశమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో, సామ్ తన సోషల్ మీడియా పోస్టులతో అభిమానులను మరింత గందరగోళానికి గురిచేస్తోంది.

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత బాగా కుంగిపోయిందని అందరికీ తెలుసు. అయితే, చైతన్య తన పాత జ్ఞాపకాలను తుడిచిపెట్టేసి, నటి శోభిత ధూళిపాళను పెళ్లాడి కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు సమంత కూడా రాజ్ నిడిమోరుతో కలిసి ఉంటున్నారని, త్వరలో వారి బంధాన్ని అధికారికం చేయనున్నారని బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వనున్నారని, అవి వచ్చే వరకు విడివిడిగా ఉంటున్నారని కూడా సమాచారం. ఈ క్రమంలో రాజ్ భార్య సోషల్ మీడియాలో కర్మ, నమ్మకం వంటి పోస్టులు పెట్టడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

Samantha s YMC Tattoo Controversy What s the Real Reason She Keeps It

చేతిలో సినిమాలు తక్కువగా ఉన్నా, సోషల్ మీడియాలో తన ఉనికిని చాటుకోవడంలో సమంత ఎప్పుడూ ముందుంటుంది. ఆమె ఒక ఫొటో పెట్టినా, పెట్టకపోయినా ట్రెండ్ అవుతుంది. ఒకసారి టాటూ వేసుకున్నా, చెరిపేసినా వార్తే. ఇలా ఏదో ఒక అంశంతో నిత్యం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇటీవల ఆమె తన మెడ వెనుక భాగంలో ఉన్న YMC (ఏ మాయ చేసావే) టాటూను తొలగించిందని వార్తలు వచ్చాయి. అది నాగ చైతన్యతో ఆమె మొదటి సినిమా గుర్తు కావడంతో, ఆ జ్ఞాపకాలను చెరిపేస్తోందని అభిమానులు భావించారు. ఆ తర్వాత రాజ్ నిడిమోరుతో వెకేషన్ ఫొటోలు షేర్ చేయడంతో ఆ టాపిక్ మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఇక తాజాగా, సమంత మళ్లీ ట్రెండింగ్ కోసం ప్రయత్నిస్తుందేమో అనిపించేలా కొత్త ఫోటోషూట్‌ను షేర్ చేసింది. చీరలో ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటోలలో, అందరి దృష్టి ఆమె వెనుక భాగంపై ఉన్న టాటూ మీదనే పడింది. కొద్ది రోజుల క్రితం కనిపించలేదనుకున్న YMC టాటూ మళ్ళీ కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ ఫోటోను ఆ టాటూ కనిపించేలానే పోజు ఇచ్చిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "ఇంకా ఆ టాటూని ఎందుకు ఉంచుకున్నావ్?", "చైతూ జ్ఞాపకాలను వదలవా?" అని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు ఇది కేవలం అటెన్షన్ కోసమే అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆ సమయంలో టాటూ వేయించుకుని దిద్దుకోలేని తప్పు చేసిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+