త్రిషతో విజయ్ చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడంపై బిగ్ బాస్ బ్యూటీ షాక్

దళపతి విజయ్.. కుటుంబ సమస్యల్లో చిక్కుకున్నారు. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం.. విడాకుల కోసం కోర్టుకెక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం అటు ఆయన పార్టీ టీవీకేను కూడా ప్రభావితం చేస్తోంది. మహిళల ఓటుబ్యాంక్ దెబ్బతినొచ్చనే ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది. ఓ ప్రముఖ నటితో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు తమిళ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఆయన విడాకుల అంశం తాజాగా వార్తల్లో నిలిచింది. రాజకీయాల్లో అడుగు పెట్టినందున విజయ్ ఈ కేసును సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. తన వైవాహిక సమస్యలను ఫ్యామిలీ కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని చూస్తోన్నారు. ఈ రాజీ ఒప్పందంలో భాగంగా విజయ్ సుమారు 250 కోట్ల రూపాయల మొత్తాన్ని భరణంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు.

Sanam Shetty Actress and Bigg Boss 4 Contestant Calls Out at Vijay-Trisha Wedding Appearance

ఇది ఇంకా ఏ కొలిక్కి రావట్లేదు. అదే సమయంలో త్రిషతో కలిసి కనిపించారు విజయ్. ఆమెతో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యారు. ఇద్దరూ ఒకే కారులో రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. త్రిషతో ఉన్న సన్నిహిత సంబంధాల్లో ఇక ఎటువంటి దాపరికం లేదనే విషయాన్ని విజయ్ చెప్పకనే చెప్పినట్టయింది. బహిర్గతం చేసినట్టయింది. విజయ్- త్రిష ఒకే కారులో వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ పరిణామాలపై బిగ్ బాస్ కంటెస్టెంట్, ప్రముఖ నటి సనమ్ షెట్టి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం అనుభవిస్తున్న బాధను విస్మరించలేమని స్పష్టం చేశారు. విజయ్ ఇలా చేయడం తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని వ్యాఖ్యానించారు. ఇది సరైన పద్ధతి కాదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై నెలకొన్న చర్చకు ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌ ద్వారా రెస్పాండ్ అయ్యారు. విజయ్- త్రిష కారులో వచ్చిన వీడియోను దీనికి యాడ్ చేశారు.

త్రిషతో కలిసి రావడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. భార్య సంగీత దుఃఖాన్ని ఇలా విస్మరించడం ఎంతమాత్రం సరికాదని అన్నారు. ఎంతోకాలంగా విజయ్ ను అభిమానిస్తోన్నానని గుర్తు చేశారు. ఇది తనను నిరాశకు గురి చేసిందని చెప్పారు. గతంలో అనేక సందర్భాల్లో విజయ్‌కు మద్దతుగా నిలిచిన సనమ్ షెట్టి.. ఇప్పుడు ఆయన బహిరంగంగా త్రిషతో కలిసి రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని సపోర్ట్ చేయలేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+