ప్రపంచంలో టాప్ 50 సినిమా దర్శకులు వీళ్లే, ఉపేంద్రకు ఎన్నో స్థానం అంటే?, హాలివుడ్, బాలీవుడ్!

ప్రపంచంలోని ఉత్తమ దర్శకుల గురించి వివరాలు సేకరించిన ఐఎండీబీ అనే సంస్థ ప్రపంచంలోని టాప్ 50 దర్శకుల పేర్లను విడుదల చేసింది. ప్రపంచంలోని అత్యుత్తమ 50 మంది సినిమా దర్శకుల జాబితాను ఐఎండీబీ సంస్థ విడుదల చేసింది. వివిధ స్థానాల్లో ఉన్న దర్శకుల గురించి సమాచారం ఇచ్చింది. అయితే ఈ దర్శకుల జాబితాలో సంచలనాల దర్శకుడు, ప్రముఖ నటుడు రియల్ స్టార్ ఉపేంద్ర స్థానం దక్కించుకున్నారు.

ఈ జాబితాలో శ్యాండిల్ వుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు ఉపేంద్ర 8వ స్థానంలో నిలవడం విశేషం. ప్రపంచంలోని అత్యుత్తమ 50 మంది దర్శకుల జాబితాలో హాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన పెద్దపెద్ద దర్శకులు ఉన్నారు. వీరి మధ్యలో శ్యాండిల్ వుడ్ కు చెందిన రియల్ స్టార్ ఉపేంద్ర పేరు కూడా ఉంది. ఇందులో రియల్ స్టార్ ఉపేంద్ర 8వ స్థానంలో చోటు దక్కించుకోవడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Sandalwood director and veteran actor Upendra has made it to the top 50 film directors

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మొదటి స్థానంలో ఉండగా, బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ రెండో స్థానంలో ఉన్నారు. వీరంతా ఉన్న లిస్ట్ లో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర పేరు 8వ స్థానంలో ఉండడం విశేషం. ఇప్పటి వరకు ఉపేంద్ర 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. సుమారు 60 సినిమాల్లో నటించారు. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ సినిమాల్లో కూడా హీరో ఉపేంద్ర నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే సినిమాల్లో నటనతో పాటు దర్శకత్వంలో మాత్రం ఉపేంద్ర తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు. ఓం, ష్, ఏ, తర్లేనా మగా తదితర సినిమాలకు చాలా డిఫరెంట్ గా దర్శకత్వం వహించిన ఉపేంద్ర డైరెక్టర్ గా అభిమానుల్లో చెరగని ముద్రవేసుకున్నాడు. ఈ సినిమాలు చూస్తే అందులో మనకు జరిగిన సంఘటనలు కూడా గుర్తుకు వస్తాయని ఎక్కువ శాతం మంది సినీ అభిమానులు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేశారు.

Sandalwood director and veteran actor Upendra has made it to the top 50 film directors

ఉపేంద్ర దర్శకత్వం వహించిన సినిమాలు మొత్తం కన్నడ ఇండస్ట్రీలో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయి. చాలా గ్యాప్ తరువాత ఉపేంద్ర నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న యూఐ సినిమా త్వరలో తెరపైకి రాబోతోంది. ఇప్పుడు నయా వేవ్ అంటే యూఐ సినిమా అని చాలా మంది అంటున్నారు. యూఐ సినిమా అనేక బాషల్లో పాన్ వర్డల్ మూవీగా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేశారు.

ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని ప్రేక్షకులకు అందిస్తూ వస్తున్న రియల్ స్టార్ ఉపేంద్ర 10 ఏళ్ల తర్వాత దర్శకత్వం వహిస్తున్న తన యూఐ సినిమాలో ఓ డిఫరెంట్ కథను చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నో కొత్త విషయాలను ఎంచుకొని తమదైన రీతిలో ప్రజలకు అందించాలని ఉపేంద్ర ప్రయత్నిస్తున్నారు. ఉపేంద్ర గత సినిమాల్లోనూ కొత్త ఆలోచనలతో కొత్తకొత్త ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. మొత్తం మీద యూఐ సినిమా విడుదల అవుతున్న సమయంలో ఉపేంద్రకు అగ్ర దర్శకుల జాబితాలో చోటు దక్కడంతో ఆయన అభిమానులు ఎగిరి గంత్తేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+