హీరోయిన్‌తో దర్శకుడు సీక్రెట్ రిలేషన్..ఏకంగా తిరుపతిలోనే తతంగం..?

ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత మరొకరు పెళ్లి పీటలెక్కుతున్నారు. హీరో, హీరోయిన్లు తమ జీవితాల్లోకి వారి భాగస్వాములకు స్వాగతం పలుకుతున్నారు. సాధారణంగా హీరో, హీరోయిన్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఓ దర్శకులు హీరోయిన్లను ప్రేమించడం చాలా అరుదుగా చూస్తుంటాం. సరిగ్గా ఇదే జరిగింది. కలర్ ఫొటో ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. కరోనా టైంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ సెలబ్రిటీలు సైతం రియాక్ట్ అయ్యారు. జాతీయ స్థాయిలో ఈ సినిమా సత్తా చాటింది. జాతీయ అవార్డు సైతం కలర్ ఫొటో సినిమా సొంతం చేసుకుంది.

కలర్ ఫొటో సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. తాజాగా సందీప్ రాజ్‌కు పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దర్శకుడు సందీప్ రాజ్ త్వరలో పెళ్లి చేసుకోబుతున్నాడనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ హీరోయిన్‌తో కొంతకాలంగా సందీప్ రాజ్ రిలేషన్ ఉన్నాడని తెలుస్తోంది. హీరోయిన్ చాందిని రావు, సందీప్ రాజ్ కొద్ది రోజుల నుంచి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం అందుతోంది. సందీప్ రాజ్ 'కలర్ ఫొటో'లో చాందిని రావు కీలక పాత్రలో నటించింది. సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన 'హెడ్స్ అండ్ టేల్స్‌'లో కూడా చాందిని రావు కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారిందని తెలుస్తోంది.

Sandeep Raj is engaged to actress Chandini Rao
తాజాగా ఈ జంట తమ ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని చూస్తున్నారట. ఈక్రమంలోనే త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారట. దీనిలో భాగంగానే వీరిద్దరి నిశ్చితార్థం నవంబర్ 11న విశాఖ పట్టణంలో జరగనున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 7న తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సందీప్, చాందిని పెళ్లి జరగబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే తమ రిలేషన్ గురించి వస్తోన్న వార్తలపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. వీరిద్దరికి సంబంధించిన ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+