Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ స్టార్ హీరో తీరు చాలా విడ్డూరంగా ఉంది బాసు, కోట్లాది మంది అభిమానులు షాక్, మోదీతో !

దేశం మొత్తం లోక్ సభ ఎన్నికల ఫివర్ స్పష్టంగా కనపడుతోంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నటీనటులు చాలా బిజీగా ఉన్నారు. అయితే నటీ, నటులు ఓ పార్టీకి మద్దతు ఇచ్చి అదే పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తుంటారు. హీరోలు, హీరోయిన్లు సైతం ఒక పార్టీ ముద్ర వేసుకుని ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు, వారి అభిమానులకు మనవి చేస్తూ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు.

అయితే ఓ స్టార్ హీరో కథ వీటికి విడ్డూరంగా ఉంది. బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గంలో శ్యాండిల్ వుడ్ స్టార్ హీరో, చాలెంజింగ్ స్టార్, డీ బాస్ దర్శన్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్‌ తరఫున ఎన్నికల ప్రచారం చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. శనివారం అంటే ఈ రోజు సాయంత్రం బెంగళూరు గ్రామీణ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో హీరో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చెయ్యడానికి దర్శన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Sandlewood star hero Darshan is campaigning in support of Congress MP candidate DK Suresh

మండ్య లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు తరపున ఎన్నికల ప్రచారం చేసిన హీరో దర్శన్ ఇప్పుడు మరో కాంగ్రెస్ అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో ఇదే మండ్య లోక్ సభ నియోజక వర్గంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన సుమలతను గెలిపించాలని హీరో దర్శన్ తో పాటు కేజీఎఫ్ హీరో యష్ ఎన్నికల ప్రచారం చేశారు. ఇప్పుడు అదే దర్శన్ కాంగ్రెస్ కు మద్దతుగా మండ్యలో ఎన్నికల ప్రచారం చేశారు.

Sandlewood star hero Darshan is campaigning in support of Congress MP candidate DK Suresh

హీరో దర్శన్ ఎన్నికల ప్రచారం గురించి కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ సోదరుడు, బెంగళూరు గ్రామీణ ఎంపీ డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు. బెంగుళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ శనివారం వస్తున్నారని, ఆయన అభిమానులు అందరూ తరలిరావాలని మనవి చేశారు. హీరో దర్శన్ ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, హీరో అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చాలి అని అభ్యర్థించారు.

బెంగళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గం, బెంగళూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన రాజరాజేశ్వరి నగర్ లో హీరో దర్శన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. యశవంత్‌పూర్ మార్కెట్‌, లగ్గెరె సర్కిల్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. అలాగే కొట్టిగేపాళ్య శ్రీనివాసనగర్‌ సర్కిల్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. బెంగళూరు సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం ఉత్తర హళ్లి, గొట్టిగెరె వార్డులోని వీవర్స్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు.

Sandlewood star hero Darshan is campaigning in support of Congress MP candidate DK Suresh

మండ్య ఎంపీ, ఇటీవల బీజేపీలో చేరిన సుమలత అంబరీష్ కు చాలా బలమైన మద్దతుదారుగా గుర్తింపు తెచ్చుకున్న హీరో, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేసిన నటుడు దర్శన్ ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం ఆశ్చర్యకరమైన పరిణామం అని ప్రజలు, రాజకీయ నాయకులు అంటున్నారు. మండ్యలోని మలవళ్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి స్టార్ చంద్రు తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన హీరో దర్శన్ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ తరపున లోక్ సభ ఎన్నికల ప్రచారం చెయ్యడంతో ఆయన అభిమానులతో పాటు ప్రజలు షాక్ అవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+