ఐటం సాంగ్‌లో సానియా మీర్జా..హీరో ఎవరంటే..?
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వైవాహిక జీవితం విషాదాంతంగా ముగిసిన సంగతి అందరికి తెలిసిందే. సానియా మీర్జా తన 15 ఏళ్ల దాపంత్య జీవితానికి గుడ్ చెప్పింది. భర్త షోయబ్ మాలిక్ మరో పెళ్లి చేసుకోవడంతో .. అతనితో సానియా మీర్జా బంధం తెగిపోయినట్టు అయింది. షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్నాడని..ఆ కారణంగానే సానియా మీర్జాతో అతను దూరంగా ఉంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ సనా జావేద్‌ను షోయబ్ పెళ్లాడాడు. ఇదిలా ఉంటే సానియా మీర్జా కూడా మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే సానియా మీర్జాకు బాలీవుడ్ సెలబ్రిటీలతో మంచి రిలేషన్ ఉంది. ఫరా ఖాన్, కరణ్ జోహార్, పరిణీతి చోప్రా , సాజిద్ ఖాన్ సహా చాలా మంది తారలు సానియాకు మంచి స్నేహితులు. గతంలో సినిమా ఆఫర్లు వచ్చినప్పటికి వాటిని ఆమె సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చింది. తాజాగా కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ సీజన్‌లో ఫరా, సానియా కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఒకవేళ తాను టెన్నిస్ క్రీడాకారిణి కాకపోతే సినిమా ఇండస్ట్రీలో పని చేసేదాన్ని అని తెలిపింది సానియా. దీనిపై ఫరా మాట్లాడుతూ సానియా ఇప్పటివరకు చాలా పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్‌లను సానియా తిరస్కరించిందని తెలిపింది.ఫరా సోదరుడు తన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌ను కూడా తనకు ఆఫర్ చేశాడని సానియా చెప్పింది. కానీ ఆ ఆఫర్ ను కూడా తిరస్కరించాను ఆమె తెలిపింది. ఎందుకు ఆ ఆఫర్‌ను అంగీకరించలేదని కరణ్ సానియాను ప్రశ్నించారు. టెన్నిస్ ప్లేయర్ కావడం వల్లే నటించలేదని సానియా వివరణ ఇచ్చింది. తనకు నటిగా లేదా గాయనిగా తెరపై కనిపించడానికి ఆసక్తి లేదు అని చెప్పుకొచ్చింది సానియా.












Click it and Unblock the Notifications