కొలికెత్తా.. కొలికెత్తా.. అని బాస్ తోనే ఛాన్స్ కొట్టేసిన బుల్లిరాజు.. ఈసారి కూడా తగ్గేదే లే !
ఈ ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ హిట్ అందుకుంది. ఏకంగా 300 కోట్లు కలెక్షన్స్ కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చింది. హీరో, హీరోయిన్లతో పాటు ఒకే ఒక్క సీన్ తో ప్రేక్షకులకు నవ్వులు పూయించాడు బుడ్డోడు బుల్లిరాజు. మా నాన్నంటే నాకు ప్రాణం.. ఎవరైనా ఏమైనా అన్నారో..అంటూ సినిమాలో బీప్ లతో రెచ్చిపోయిన ఈ పిల్లోడి కామెడీకి థియేటర్లో జనాలు ఫుల్ గా నవ్వుకున్నారు.
ఈ మూవీ సక్సెస్ తో ప్రేక్షకుల్లో బుల్లిరాజుకి మంచి ఆదరణ లభిస్తోంది. పలు టీవీ షోలలో సైతం పాల్గొంటూ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నారు. అయితే ఈ బుడ్డోడు ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చిరంజీవి, అనిల్ ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్లు చేశారు.

ఈ మూవీ కోసం చిరు 90 రోజుల కాల్ షీట్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ మే నెలలో స్టార్ట్ అయి అక్టోబర్‌లో పూర్తి అవుతుందని అనుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో బుల్లిరాజుని కూడా తీసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. ఈ చిత్రంలో కూడా బుల్లిరాజు కోసం ఓ ప్రత్యేకమైన పాత్ర రాయాలని అనిల్ ఆలోచిస్తున్నారట. సంక్రాంతికి వస్తున్నాం టైపులోనే స్పెషల్‌గా ఈ క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా చిరు - బుల్లిరాజు కాంబినేషన్ లో కొన్ని సీన్లు ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ కోడై కూస్తుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో చిరు కామెడీ టైమింగ్ కి.. బుల్లిరాజు కూడా యాడ్ అయితే మామూలుగా ఉండదు అంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మెగాస్టార్ ప్రస్తుతం బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' మూవీ చేస్తున్నారు. ముగింపు దశకు చేరుకున్న ఈ మూవీ ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్లు, వీడియోలు ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.












Click it and Unblock the Notifications