అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !!
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ప్రామిసింగ్ యంగ్ హీరోలుగా దూసుకుపోతున్న అన్నదమ్ములు సంతోష్ శోభన్ మరియు సంగీత్ శోభన్. వీరిద్దరూ దివంగత దర్శకుడు శోభన్ (వర్షం సినిమా దర్శకుడు) కుమారులు. వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సంతోష్ తన క్లాస్, ఫ్యామిలీ ఓరియెంటెడ్ నటనతో ఆకట్టుకుంటుంటే.. సంగీత్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్, ఈజ్ తో యూత్‌కు దగ్గరయ్యారు.
సంతోష్ కెరీర్..
సంతోష్ శోభన్ బాలనటుడిగా 'గోల్కొండ హైస్కూల్' సినిమాతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత 'తను నేను' చిత్రంతో హీరోగా పరిచయమై.. 'పేపర్ బాయ్' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా 'ఏక్ మినీ కథ' చిత్రం ఓటీటీలో భారీ విజయాన్ని సాధించి.. సంతోష్‌ను టాలీవుడ్‌లో నిలబెట్టింది. ఆ తర్వాత 'మంచి రోజులు వచ్చాయి', 'లైక్ షేర్ సబ్స్క్రైబ్', 'శ్రీదేవి శోభన్ బాబు', 'కళ్యాణం కమనీయం', 'అన్ని మంచి శకునములే' సినిమాలలో తన మెచ్యూర్డ్ నటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు.

సంగీత్ కెరీర్..
మరోవైపు సంగీత్ కూడా బాలనటుడిగా 'గోల్కొండ హైస్కూల్' సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్‌లో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. ఆ గుర్తింపుతోనే వెండితెరపై 'మ్యాడ్ (MAD)' సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో సంగీత్ చేసిన కామెడీ, టైమింగ్ థియేటర్లలో నవ్వులు పూయించాయి. ఆ తర్వాత దానికి సీక్వెల్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా మంచి హిట్ అందుకుంది.
కపుల్ ఫ్రెండ్లీ & రాకాస..
ఇక రీసెంట్ గానే ప్రేమికుల రోజు నాడు సంతోష్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ సాధించింది. చాలా కాలంగా హిట్ కోసం చూస్తున్న ఈ యంగ్ హీరోకి ఈ మూవీ సక్సెస్ ఒక బ్రేక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు సంగీత్ శోభన్ సైతం వరుస హిట్లతో దూసుకుపోతూ.. హ్యాట్రిక్ హిట్ కోసం "రాకాస" తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే మూవీ ఫస్ట్ షో నుంచే.. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ చిత్రం. దాంతో కొంచెం గ్యాప్ లోనే అన్నదమ్ములు ఇద్దరు సాలిడ్ హిట్స్ అందుకున్నారని వారి అభిమానులు ఖుషి అవుతున్నారు. మొత్తంగా ఈ శోభన్ బ్రదర్స్ టాలీవుడ్‌లో తమదైన ముద్ర వేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications