'పెళ్లి కాని ప్రసాద్' రివ్యూ.. సప్తగిరి హీరోగా మెప్పించాడా..?
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల
బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్
విడుదల: SVC
డిఓపి: సుజాత సిద్దార్థ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: మధు
సప్తగిరి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చేయాల్సిన పనిలేదు. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు సప్తగిరి.కమెడియన్‌గా పీక్ టైంలో ఉండగానే సప్తగిరి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.''సప్తగిరి ఎక్స్ ప్రెస్, సప్తగిరి ఎల్ ఎల్ బి'' వంటి మూవీస్ చేసి మెప్పించాడు. చాలా గ్యాప్ తర్వాత సప్తగిరి తిరిగి హీరోగా నటించిన చిత్రమే 'పెళ్ళి కాని ప్రసాద్'. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పెళ్లి కాని ప్రసాద్ కథ:
ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఒక స్టార్ హోటల్ లో పని చేస్తూ ఉంటాడు. 38 ఏళ్ల వయసులో తన తండ్రి (మురళీధర్) తమ పూర్వీకుల కట్నం హిస్టరీ చెప్పి 2 కోట్లు తక్కువైతే పెళ్ళి చేసుకోకూడదు అని చెప్పిన మాటలు జవదాట లేక అలాంటి సంబంధం కోసం చూస్తూ ఉంటాడు. అమ్మాయి అయి ఉండి 2 కోట్లు కట్నం ఇస్తే చాలని అనుకుని చూస్తున్న అతనికి అదే ఊరిలో ఉండే ప్రియ ( ప్రియాంక శర్మ) పరిచయం అవుతుంది. ఆమె తన తల్లితండ్రులు అమ్మమ్మతో కలిసి ఫారిన్ లో సెటిల్ అవ్వాలని ముందు నుంచి కలలు కంటూ ఉంటుంది. ప్రసాద్ గురించి తెలిసి అతన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రసాద్ ఇక ఫారిన్ వెళ్లకూడదు అని అనుకున్న విషయంలో ఇద్దరూ గొడవపడతారు. అయితే అసలు ప్రసాద్ ఫారెన్ ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాడు? చివరికి పెళ్ళికాని ప్రసాద్ పెళ్లి చేసుకున్న ప్రసాద్ అయ్యాక ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.

నటీనటుల ఫర్మామెన్స్
నటీనటుల గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సప్తగిరి మొత్తం బాధ్యతలు తన భుజాన మోసాడు. వన్ మాన్ ఆర్మీగా నవ్వించే బాధ్యతలు తీసుకున్నాడు. సప్తగిరికి ఇలాంటి పాత్రలు చేయడం కొట్టిన పిండి. అలానే అవలీలగా చేసేశాడు.వయసు పైపడుతున్న ఇంకా పెళ్లి కాక, తండ్రిని ఎదిరించలేక ఇబ్బంది పడే కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. అయితే తర్వాత ప్రేమలో పడటం ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న క్రమంలో ఆమె తనను కాదు తన ఫారం ఉద్యోగాన్ని చూసి ప్రేమించిందని తెలుసుకుని బాధపడే పాత్రలో ఇమిడిపోయాడు. ఇక ఆ తర్వాత అంతగా నటనకు స్కోప్ ఉన్న పాత్ర మురళీధర్ గౌడ్ ది. ఇప్పటికే పోలి సినిమాలతో ప్రూవ్ చేసుకున్న ఆయన ఈ సినిమాలో మరోసారి ఆకట్టుకున్నాడు. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది. మిగతా నటీనట్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీం
టెక్నికల్ టీం విషయానికి వస్తే ఈ సినిమాలో శేఖర్ చంద్ర అందించిన పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా చాలా సీన్స్ లో ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు కొన్ని సాంగ్స్ చిత్రీకరణ చాలా బాగుంది. చాలా డైలాగ్స్ నవ్విస్తూనే ఆలోచింపచేసేలా ఉన్నాయి. నిజానికి సినిమాలో మెసేజ్ ఇచ్చే అవకాశం ఉన్న వాటి జోలికి పోకుండా పూర్తిస్థాయిలో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసింది సినిమా యూనిట్. దర్శకుడు కేవలం నవ్వించడాన్నే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. కథ పెద్దగా లేకున్నా సిచువేషనల్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు.
విశ్లేషణ
పెళ్లి చుట్టూ రాసుకున్న కథతో మనం ఎన్నో సినిమాలు చూసాం. ఇప్పుడు ఈ సినిమా కూడా దాదాపు అలాగే రూపొందించబడింది. ఒక పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న కుర్రాడిని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటున్న అమ్మాయి మన ఫ్యామిలీతో కలిసి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత అసలు ఫారిన్ వెళ్లడు అని తెలిసి ఏం చేశారు? అనే లైన్ తో ఈ సినిమా రూపొందించారు. కథ కొత్తగా అనిపించకపోయినా సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించి ఉద్దేశంతో రాసుకున్నాడు దర్శకుడు. అయితే కొన్ని చోట్ల కామెడీ అవుట్ ఆఫ్ ది బాక్స్ అనిపించిన కొన్ని చోట్ల మాత్రం బాగా పేలింది. అయితే క్లైమాక్స్ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
పంచ్ లైన్ : ఈ పెళ్ళి కాని ప్రసాద్ కష్టాలు నవ్విస్తాయి.
రేటింగ్ : 3












Click it and Unblock the Notifications